స్పీడు పెంచేసిన కిర‌ణ్ అబ్బ‌వ‌రం

ఈమ‌ధ్యే `వినరో భాగ్య‌ము విష్ణు క‌థ‌` సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు కిర‌ణ్ అబ్బ‌వ‌రం. ఆ సినిమా యావ‌రేజ్ ద‌గ్గ‌ర ఆగిపోయింది. అయితే.. కిర‌ణ్ స్పీడు మాత్రం మామూలుగా లేదు. వ‌రుస‌గా సినిమాల్నిప‌ట్టాలెక్కిస్తున్నాడు. `మీట‌ర్` మైత్రీలో రెడీ అవుతోంది. ఇది ప‌క్కా మాస్ యాక్ష‌న్ సినిమా. ఇప్పుడు మ‌రో సినిమాని మొద‌లెట్టేశాడు. విశ్వ‌క‌రుణ్ అనే కుర్రాడు ఈ సినిమాతో ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఇది కూడా మాస్‌, యాక్ష‌న్ జోన‌ర్‌లో సాగే సినిమానే. ఈమ‌ధ్య కిర‌ణ్‌కి మాస్ క‌థ‌ల‌పై మ‌క్కువ పెరుగుతోంది. `మీట‌ర్‌` పూర్తి స్థాయి యాక్ష‌న్ సినిమా. ఇందులో పోలీస్ గా క‌నిపించ‌బోతున్నాడు. ఈ కొత్త సినిమాలో సైతం.. యాక్ష‌న్ కి పెద్ద పీట వేశార‌ని తెలుస్తోంది. అంతే కాదు.. కిర‌ణ్ అబ్బ‌వ‌ర‌పు కెరీర్‌లోనే అత్య‌ధిక బ‌డ్జెట్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నార్ట‌. `మీట‌ర్‌` కోసం మైత్రీ మూవీస్ భారీగా ఖ‌ర్చు పెట్టింది. దానికి మించి ఈ సినిమా బ‌డ్జెట్ కేటాయించ‌డం విశేషం. చూస్తుంటే కిర‌ణ్ అబ్బ‌వ‌రం మెల్ల‌మెల్ల‌గా త‌న సినిమా బ‌డ్జెట్ పెంచుకొంటూ పోతున్న‌ట్టే క‌నిపిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close