జనవరి 18న ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఆడియో విడుదల

‘నమో వెంకటేశ’, ‘దూకుడు’, ‘1 నేనొక్కడినే’, ‘లెజెండ్’, ‘పవర్’(కన్నడం), ‘ఆగడు’, వంటి భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించిన ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం7గా యంగ్ హీరో నాని, మెహరీన్(నూతన పరిచయం) హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కు, టైటిల్ కు ఆడియెన్స్ నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది.

‘భలే భలే మగాడివోయ్’ వంటి సక్సెస్ ఫుల్ చిత్రం తర్వాత నాని హీరోగా నటిస్తున్న చిత్రమిది. అందాల రాక్షసి వంటి డిఫరెంట్ లవ్ స్టోరీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన యంగ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకుడిగా ఈ ఎగ్జయిటింగ్ ఎంటర్ టైనింగ్ లవ్ స్టోరి తెరకెక్కుతోంది. రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర నిర్మాతలు. ఈ చిత్రానికి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రత్నవేలు అసిస్టెంట్ యువరాజ్ సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఎ.ఆర్.రెహమాన్ మ్యూజిక్ స్కూల్ కు చెందిన విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమాన్ని జనవరి 18న సినీ ప్రముఖుల సమక్షంలో నిర్వహిస్తున్నారు. అలాగే ఈ రోజు సాయంత్రం థిమేటిక్ టీజర్ ను కూడా విడుదల చేస్తున్నారు. అన్నీ కార్యక్రమాలను పూర్తి చేసి ఫిభ్రవరి మొదటి వారంలో సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయని చిత్ర నిర్మాతలు తెలియజేశారు.

నాని, మెహరీన్, సంపత్, మురళీశర్మ, బ్రహ్మాజీ, పృథ్వీ, శత్రు, హరీష్ ఉత్తమన్, బేబి నయన, మాస్టర్ ప్రతాప్, బేబి మోక్ష తదితరులు తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: యువరాజ్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్, ఫైట్స్: విజయ్, డ్యాన్స్: రాజు సుందరం, ఎడిటర్: వర్మ, ఆర్ట్: అవినాష్ కొల్ల, లైన్ ప్రొడ్యూసర్: హరీష్ కట్టా, లిరిక్స్: కె.కె.(కృష్ణకాంత్), కో డెరక్టర్: సాయి దాసం, డైలాగ్స్: హను రాఘవపూడి, జయకృష్ణ, నిర్మాతలు: రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: హను రాఘవపూడి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com