రెబ‌ల్ స్టార్‌.. చేప‌ల పులుసు

రెబ‌ల్ స్టార్ కృష్ణం రాజు మంచి భోజ‌న ప్రియులు. తాను తిన‌డ‌మే కాదు, ఇంటికొచ్చిన‌వాళ్ల‌కు ర‌క‌ర‌కాల వంటకాల‌తో.. విందు చేస్తారు. మాంసాహారం చేయ‌డంలో, చేయించ‌డంలో కృష్ణంరాజు ఇంట్లోవాళ్ల‌ని సెప‌రేటు హ్యాండు. ప్ర‌భాస్ సినిమా షూటింగ్ జ‌రుగుతుంటే.. ఆ ఇంటి నుంచి క్యారియ‌ర్లు.. క్యారియ‌ర్లు… వ‌స్తూనే ఉంటాయి. రొయ్య‌ల బిరియానీ, చేప‌ల పులుసు… ఇవ‌న్నీ కృష్ణంరాజు ఇంట్లో మ‌రింత స్పెష‌ల్‌.

తాజాగా కృష్ణంరాజు పాక శాస్త్రంలో త‌న ప్రావీణ్యాన్ని చూపించారు. వంటింట్లో దూరి త‌న స్వ‌హ‌స్తాల‌తో చేప‌ల పులుసు చేశారు. ఈ వీడియో ఇప్పుడు నెటింట్లో సంద‌డి చేస్తోంది.

కృష్ణంరాజు కుమార్తె సాయి ప్రదీమా ఈ వంట వీడ‌దియోని తన ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. `వీకెండ్ స్పెషల్.. డాడీ చేపల పులుసు చేశారు. చేపల పులుసు చేయడంలో ఆయనను మించిన వారు లేరు. కేవలం వాసన చూసి ఉప్పు సరిపోయిందో, లేదో చెప్పేస్తారు. నాన్న అందులో ఎక్స్‌పర్ట్` అని ట్వీట్ చేశారు. ఈ సీజ‌న్లో పుస‌ల చాలా విరివిగా దొరుకుతుంది. గోదారి జిల్లా వాసుల‌కు ఇది చాలా ఇష్ట‌మైన వంట‌కం. మ‌రి.. కృష్ణంరాజు చేసింది కూడా పుల‌స పులుసే అయ్యింటుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close