బంగార్రాజులో.. కృతి ఖ‌రారు కాలేదా?

`సోగ్గాడే చిన్నినాయిన‌` కి ప్రీక్వెల్ గా రాబోయే సినిమా.. `బంగార్రాజు`. ఇందులో నాగార్జున‌తో పాటుగా.. నాగ‌చైత‌న్య కూడా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. చైతూ ప‌క్క‌న క‌థానాయిక‌గా కృతి శెట్టి ఖ‌రారు అయ్యింద‌న్న‌ది టాలీవుడ్ టాక్‌. ఈ సినిమా కోసం ఆమెకు భారీ మొత్తంలో పారితోషికం కూడా ఇచ్చార‌ని చెప్పుకున్నారు. అయితే.. ఈ సినిమాలో హీరోయిన్‌ని ఇంకా ఖ‌రారు చేయ‌లేద‌ని తెలుస్తోంది. “కృతి శెట్టిని అనుకున్న మాట నిజ‌మే. కానీ ఇంకా సంప్ర‌దింపుల్లోనే ఉన్నాం. ఇంకా ఎవ‌రినీ ఫైన‌ల్ చేయ‌లేదు“ అని చిత్ర‌బృందంలోని ఓ కీల‌క‌మైన స‌భ్యుడు తెలిపారు. కృతిని సంప్ర‌దించినా, ఆమె అడిగినంత పారితోషికం ఇస్తామ‌న్నా.. కృతి ఇంకా త‌న నిర్ణ‌యాన్ని చెప్ప‌లేద‌ట‌. త‌న కాల్షీట్లు ఇంకా స‌ర్దుబాటు కావ‌డం లేద‌ని. బంగార్రాజు షూటింగ్ షెడ్యూల్, అందులో నాగ‌చైత‌న్య డేట్లు.. ఖ‌రారు అయ్యేంత వ‌ర‌కూ.. కృతి కాల్షీట్ల విష‌యంలో ఓ నిర్ణ‌యానికి రాలేరు. అందుకే కృతి ఈ ప్రాజెక్టుని ఇంకా హోల్డ్ లోనే పెట్టిన‌ట్టు తెలుస్తోంది. కాల్షీట్లు కుదిరితే.. ఓకే. లేదంటే మ‌రో క‌థానాయిక ని చూసుకోవాలి. క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే ఈ చిత్రాన్ని అన్న‌పూర్ణ స్టూడియోస్ సంస్థ నిర్మిస్తోంది. ర‌మ్య‌కృష్ణ కీల‌క పాత్ర‌ధారి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close