ఢిల్లీ రాజకీయాలకూ కేటీఆరేనా ? కేసీఆర్ తెర వెనకేనా ?

రాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు టీఆర్ఎస్ మద్దతు పలికింది. ఈ అంశంపై చివరి క్షణం వరకూ క్లారిటీ ఇవ్వని కేసీఆర్.. చివరి క్షణంలో సిన్హాకు మద్దతు ప్రకటించి.. కేటీఆర్‌ను ఢిల్లీ పంపారు. నామినేషన్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆదేశించారు. నిజానికి ఈ కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొంటే.. హైప్ వచ్చేది. కానీ కేసీఆర్ మాత్రం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌ను మాత్రమే పంపారు. దీంతో ఢిల్లీ రాజకీయాల్లోనూ కేటీఆరే కనిపించారు. ఇప్పటి వరకూ తెలంగాణకు సంబంధించినంత వరకూ టీఆర్ఎస్ రాజకీయాలు మొత్తం కేటీఆర్ కనుసన్నల్లో నడుస్తున్నాయి.

ఢిల్లీకి సంబంధించినంత వరకూ ప్రధానంగా కేసీఆరే ఇన్వాల్వ్ అవుతున్నారు. కేసీఆర్ తరపున కవిత పనులు చక్క బెడుతున్నారు. ఒక వేళ కేసీఆర్ కాకపోతే.. కవిత ఢిల్లీ వెళ్లి యశ్వంత్ సిన్హాకు మద్దతు ప్రకటించి ఉండవచ్చని కానీ అలా జరగలేదని.. కేటీఆర్‌నే పంపారని ఇది అనూహ్యమేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కొత్త జాతీయ పార్టీపై సీరియస్‌గా వర్కవుట్ చేస్తున్న కేసీఆర్… ఆ పార్టీ పై కీలక అప్ డేట్‌తోనే మళ్లీ తెర ముందుకు రావాలనుకుంటున్నట్లుగా తెలుస్తోంది.

అప్పటి వరకూ బ్యాక్ గ్రౌండ్ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తారని అంటున్నారు. యశ్వంత్ సిన్హా గట్టిగా పోటీ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేకపోవడంతో… కేసీఆర్ ఢిల్లీకి వెళ్తే.. పెద్దగా ప్రయోజనం ఏమీ ఉండదని.. గట్టి పోటీ ఉంటే… ప్రయత్నించినా ఫలితం ఉండేదంటున్నారు. కారణం ఏదైనా కేసీఆర్ చాలా కాలంగా ఫామ్ హౌస్‌కే పరిమితం అయ్యారు. మరో నెల రోజుల వరకూ ఆయన అలాగే రాజకీయం చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close