డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌పై కేటీఆర్ ముందు జాగ్ర‌త్త‌?

డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్లు – మిగ‌తా అంశాల్లో ప్ర‌తిప‌క్షాల‌కు విమ‌ర్శించే వీలు ఇవ్వ‌డం లేదుగానీ, ఈ ఒక్క హామీ ద‌గ్గ‌ర‌కి వ‌చ్చేస‌రికి అధికార పార్టీ తెరాస‌ త‌ట‌ప‌టాయించాల్సి పరిస్థితి రాబోయే రోజుల్లో వ‌చ్చే అవ‌కాశ‌మే క‌నిపిస్తోంది. ఎందుకంటే, ఓప‌క్క ఇదే అంశాన్ని పెద్ద‌ది చేసి… ప్ర‌తీరోజూ విమ‌ర్శ‌లు చేస్తున్నారు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి. అర్హులైన‌వారికి ఇళ్లేవీ అంటూ లెక్క‌లు తీస్తున్నారు. అయితే, ఇప్ప‌టికిప్పుడు వివ‌ర‌ణ ఇచ్చుకోవాల్సిన అవ‌స‌రం తెరాస‌కు లేదు. రేవంత్ విమ‌ర్శ‌ల‌పై స్పందించి, ఆయ‌న‌కి పొలిటిక‌ల్ మైలేజ్ ఇచ్చే ప‌నులూ చెయ్య‌రు! కానీ, ఈ విమ‌ర్శ‌లు మొద‌లైన త‌రుణంలో కొంత అప్ర‌మ‌త్తంగా ఉండే ప్ర‌య‌త్నం మంత్రి కేటీఆర్ ప్రారంభించిన‌ట్టుగా క‌నిపిస్తోంది.

ఖ‌మ్మంలో ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మంలో ఆయ‌న పాల్గొన్నారు. కేటీఆర్ మాట్లాడుతూ… ఖ‌మ్మంలో కాలువ ఒడ్డు మార్కెట్లో కాసేపు ఆగి, కూర‌గాయ‌లూ పండ్లు అమ్ముకునేవాళ్ల‌తో ముచ్చ‌టించా అన్నారు. పూలు అమ్ముకుంటున్న శ్రీ‌దేవి అనే అమ్మాయితో తాను మాట్లాడితే… పేద‌వాళ్లంద‌రికీ కేసీఆర్ బాగా చేస్తున్నార‌న్నా అని ఆమె సంతోషంగా చెప్పింద‌న్నారు. అత్త‌మ్మ‌కి పెన్ష‌న్ వ‌స్తోంది, పిల్ల‌లు బ‌డికి పోతున్నారు, అక్క‌డ స‌న్న‌బియ్యంతో వాళ్ల‌కి మంచిగా భోజ‌నం పెడుతున్నారు, బంధువుల ఇంట్లో ఆడ‌బిడ్డ పెళ్ల‌యితే కల్యాణ ల‌క్ష్మి ప‌థ‌కం కింద పైస‌లు వ‌చ్చాయ‌ని చెప్పింద‌న్నారు. ఇన్నొచ్చాయిగానీ, ఇంకో ప‌ని చేయాల‌ని ఆమె అడిగింద‌నీ, డ‌బుల్ బెడ్ రూమ్ ఇల్లు కావాల‌ని కోరింద‌ని కేటీఆర్ చెప్పారు. ఇక్క‌డే కేటీఆర్ జాగ్ర‌త్త ప‌డింది! ఆమె ఇల్లు కోరింది అంటే… ఇంకా ప్ర‌భుత్వం ఇవ్వ‌లేదు అనే సెన్స్ వ‌స్తుంది కదా! విన‌గానే ఎవ‌రికైనా అదే అనిపిస్తుంది. అందుకే, వెంట‌నే డైవ‌ర్ట్ చేయ‌డానికి అన్న‌ట్టుగా… ఇన్ని చేసిన ముఖ్య‌మంత్రి, ఇది మాత్రం ఎందుకు చేయ‌లేరు, త‌ప్ప‌కుండా చేస్తార‌ని కేటీఆర్ చెప్పారు. బిడ్డ పుట్టిన ద‌గ్గ‌ర్నుంచీ, పెరిగి పెద్దై, చ‌దువు నుంచి వృద్ధాప్యం వ‌ర‌కూ కేసీఆర్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న సంక్షేమ ప‌థ‌కాలను కేటీఆర్ ఏక‌రువుపెట్టారు.

డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల విష‌యంలో ఇది ముందుజాగ్ర‌త్త ప్ర‌య‌త్నంగానే క‌నిపిస్తోంది. రెండు ప‌ర్యాయాలు ముఖ్య‌మంత్రి అయినా ఈ హామీని కేసీఆర్ నిలబెట్టుకోలేక‌పోతున్నార‌నే ప్ర‌చారాన్ని ప్ర‌తిప‌క్షాలు ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేలోపుగా…. ఇన్ని చేస్తున్నారు, ఇదీ కేసీఆర్ చేస్తారులే అనే ధీమా ప్ర‌జ‌ల‌కు క‌లిగించే ప్ర‌య‌త్నంగా క‌నిపిస్తోంది. కేటీఆర్ ప్ర‌సంగంలో గ‌మ‌నించాల్సింది ఏంటంటే… డ‌బుల్ బెడ్ రూమ్ ఇళ్ల టాపిక్ రాగానే, దాన్నుంచి సంక్షేమ ప‌థ‌కాలు, అక్క‌డి నుంచి అభివృద్ధి అంటూ ఇత‌ర అంశాల‌పై చ‌క‌చ‌కా మాట‌లు మ‌ళ్లించేశారు!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close