కేసీఆర్ స‌భ‌కీ జ‌నం రాలేదు… దాన్నీ విముఖ‌తే అనుకోమంటారా?

ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ, కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీల‌పై తీవ్ర విమ‌ర్శ‌లు చేశారు తెలంగాణ సీఎం కేసీఆర్‌. రామ‌గుండంలో జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార స‌భ‌లో ఆయ‌న మాట్లాడుతూ… తూ కిత్తా మే కిత్తా అంటూ రాహుల్ మోడీలు ఒక‌రిపై ఒక‌రు విమ‌ర్శ‌లు చేసుకుంటున్నార‌నీ, మోడీ కాక‌పోతే రాహుల్‌, రాహుల్ కాక‌‌పోతే మోడీ వీళ్ల మ‌ధ్య‌నే అధికారం ఉండాలా అని ప్ర‌శ్నించారు? త‌న‌కు ఢిల్లీ నుంచి పూర్తి స‌మాచారం ఉంద‌నీ… ఈ రెండు జాతీయ పార్టీల‌కూ సంపూర్ణ మెజారిటీ రాద‌న్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల త‌రువాత ప్రాంతీయ పార్టీలే జాతీయ స్థాయిలో ప్ర‌భుత్వ ఏర్పాటులో కీల‌కం కాబోతున్నాయ‌న్నారు. అందుకే, రాష్ట్రంలోని 16 లోక్ స‌భ స్థానాలు తెరాస గెలిస్తే… దేశానికి దిశా దిశానిర్దేశం చేసి, త‌న తెలివితేట‌ల‌తో మార్పుల‌ను తీసుకొస్తా అన్నారు కేసీఆర్‌.

న‌రేంద్ర మోడీ, రాహుల్ గాంధీల‌పై ప్ర‌జ‌లు విముఖం చెందార‌ని కేసీఆర్ చెప్పారు. వీళ్లు పెడుతున్న స‌భ‌ల‌కు జ‌నం రావ‌డం లేద‌న్నారు. జ‌నాల‌కి ఇష్టం లేక‌పోతే కాళ్లు మొక్కినా రార‌నీ, మ‌నం ఇలాంటివి ఈ మ‌ధ్య‌ చూస్తున్నామ‌ని అన్నారు. ఇవాళ్ల రాహుల్ గాంధీ స‌భ పెడితే నాలుగైదు వేలమంది వ‌చ్చార‌న్నారు. న‌రేంద్ర మోడీ ప్ర‌చారానికి వ‌చ్చి, బ‌య‌ట కూర్చున్నార‌న్నారు. ఎందుకంటే, జ‌నం లేర‌న్నారు! సభ‌ల‌కు ఎందుకు జ‌నాలు రావ‌డం లేద‌ని వాళ్లు గ‌మ‌నించ‌డం లేదన్నారు కేసీఆర్‌. వారిపై ప్ర‌జ‌లు విముఖ‌త‌తో ఉన్నార‌ని ఆయా పార్టీల‌వారు గుర్తించ‌డం లేద‌న్నారు. ఈ దేశంలో మార్పు రావాలంటే ఎవ‌రో ఒక‌రు ధైర్యం చేసి ముందుకు రావాల‌నీ, అందుకే తాను ముందుకొచ్చాన‌న్నారు కేసీఆర్.

స‌భ‌ల‌కు జ‌నాలు రావ‌డం అనే టాపిక్ కేసీఆర్ ట‌చ్ చేయ‌కుండా ఉండాల్సింది! మోడీని, రాహుల్ విమ‌ర్శించాలంటే ఆయ‌న‌కి అందుబాటులో ఉన్న విమ‌ర్శ‌నాంశాలు చాలా ఉన్నాయి. కానీ, వారి స‌భ‌ల‌కు జ‌నం రావ‌డం లేద‌ని ప్ర‌స్థావించ‌డం ద్వారా… తాజాగా జ‌నాలు రాలేద‌న్న కార‌ణంతో హైద‌రాబాద్ లో జ‌ర‌గాల్సిన స‌భ‌ను కేసీఆర్ ర‌ద్దు చేసుకున్న సంద‌ర్భాన్ని ఆయ‌నే గుర్తు చేసిన‌ట్టు అయింది. వాస్త‌వాలు మాట్లాడుకుంటే… నాయ‌కుల స‌భ‌కు జ‌నాలు రావ‌డానికి, నాయ‌కుల పాపులారిటీకి సంబంధం లేకుండా పోయింది! ఏ స్థాయి నాయ‌కుడి స‌భ‌ల‌కైనా జ‌నాలు స్వ‌చ్చందంగా వచ్చేవాళ్లు త‌క్కువ‌, స‌మీక‌రిస్తేనే వ‌స్తున్నారు. ఆ స‌మీక‌ర‌ణ‌లో ఎక్క‌డైనా స‌మ‌న్వ‌య లోపం ఉంటే ఎలా ఉంటుందో కేసీఆర్ కి తెలుసు! అలాంట‌ప్పుడు, స‌భ‌ల‌కు జనాలు రాక‌పోవ‌డ‌మే విముఖ‌త అని వ్యాఖ్యానిస్తే… మ‌రి, ఆయ‌న స‌భ‌కు కూడా జ‌నాలు రాలేదుగా….అని వెంట‌నే ఎవ‌రికైనా అనిపిస్తుంది క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close