టీఆర్ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లోకి రివర్స్ వలసలు !

2018 అసెంబ్లీ ఎన్నికల ముందు, తర్వాత కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పి.. టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్న నేతలు తాజాగా సొంతగూటికి వెళ్లడానికి ముహుర్తం పెట్టుకుంటున్నారు. ఈ చేరికలు వరుసగా ప్రారంభమయ్యాయి. ముందు ఎమ్మెల్యేలు కూడా ఉంటారన్న చర్చ జరుగుతోంది. హైదరాబాద్ శివారులోని బడంగ్‌పేట నగర పాలక సంస్థ మేయర్‌ కాంగ్రెస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఓ మేయర్ పార్టీ మారడం అంటే టీఆర్ఎస్‌కు ఊహించంని షాకే. ఆరుగురు కార్పొరేటర్లతో కలిసి మేయర్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. మంత్రి సబిత వారిని ఆపేందుకు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.

తీగల కృష్ణారెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రయత్నిస్తున్నారు. వీరంతా రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేలు కూడా వెనక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎల్‌బీ నగర్‌ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఎంపీగా తన విజయంలో కీలక పాత్ర పోషించారని రేవంత్ రెడ్డి చెబుతూ ఉంటారు. అయితే తర్వాత ఆయన టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతోనూ చర్చలు పూర్తి చేశారు. ఒక వేళ ఎమ్మెల్యే రాకపోతే టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేసిన నేతను చేర్చుకునేందుకు రేవంత్ రంగం సిద్ధం చేశారు.

ఇక అనేక మంది పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో రేవంత్ టచ్‌లోకి వెళ్లారు. జూపల్లి కృష్ణారావు కాంగ్రెస్‌లోకి వచ్చేందుకు అనువైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. ఇలా వరుసగా చేరికలపై రేవంత్ దృష్టి పెట్టారు అయితే ఎవరూ బీజేపీ వైపు చూడాలనుకోవడం లేదు. బలమైన నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉండటంతో కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. ఇది ఆ పార్టీకి మరింత ఊపునిస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close