మెస్సీ ఫుట్ బాల్ మ్యాచ్ అంటే.. గంటన్నర సేపు మ్యాచ్ ఉంటుందని .. మెస్సీ విన్యాసాలు చూడవచ్చని అనుకుంటే ఫ్యాన్స్ ఖచ్చితంగా హర్ట్ అవుతారు. హైదరాబాద్ స్టేడియంలోనూ మెస్సీ షెడ్యూల్ కేవలం అరగంట మాత్రమే ఉంటుంది. మామూలుగా మెస్సీ లేకుండా మ్యాచ్ 7.50 నిమిషాలకు స్టార్ట్ అవుతుంది. పావుగంట సేపు వారు మ్యాచ్ ఆడుతారు. ఆ తర్వాత సీఎం గ్రౌండ్ లోకివస్తారు.. ఆ తర్వాత మెస్సీ గ్రౌండ్ లోకి వస్తారు.
మెస్సీ, రేవంత్ బాల్‌తో ఒకటి, రెండు నిమిషాలు తలపడిన తర్వాత మ్యాచ్ పూర్తిగా పెనాల్టీ షూటౌట్లాగే ఉంటుంది. ఇదంతా కర్టసీగానే జరుగుతుంది. ఇదంతా పది నిమిషాలు, నిఖార్సుగా మ్యాచ్ జరిగేది ఈ పది నిమిషాలే. ఇతర ఆటగాళ్లు పావుగంట సేపు మ్యాచ్ ఆడతారు. ఆ తర్వాత రాహల్ గాంధీ గ్రౌండ్ లోకి వస్తారు. గ్రూప్ ఫోటో తర్వాత పిల్లలతో కొన్ని కార్యక్రమాలు ఉంటాయి. అవి మొత్తం ఇరవై నిమిషాలు ఉంటాయి. మొత్తంగా అరగంట తర్వాత అందరూ గ్రౌండ్ నుంచి వెళ్లిపోతారు.
ఈ మేరకు వివణాత్మక షెడ్యూల్ ను పోలీసులు విడుదల చేశారు. ఈ అంశంపై స్టేడియంకు వచ్చే వారికి ముందుగానే స్పష్టమైన సమాచారం ఇస్తే గందరగోళం ఏర్పడకుండా ఉంటుంది. మెస్సీ స్టేడియంలో ఉండేది అరగంట సమయం మాత్రమే అవి విస్తృతంగా ప్రచారం చేస్తే వారు నిరాశ చెందకుండా ఉంటారు. లేకపోతే కోల్ కతా తరహాలో.. మెస్సీ వెళ్లిపోగానే ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంది.
