లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించాలని చంద్రబాబును ఎందుకు రెచ్చగొడుతున్నట్లు..!?

టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్‌కు వస్తానని చెప్పడం లేదు. లాక్ డౌన్‌ను నెలాఖరు వరకు పొడిగించి.. అందరూ ఇళ్లలోనే ఉండాలని కోరుతున్నారు. స్వయంగా తాను లాక్ డౌన్ పాటిస్తున్నారు. లాక్‌డౌన్‌ను ఉల్లంఘించి ఏపీలో పర్యటించాలని ఆయన అనుకోవడం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ మంత్రులు అదే పనిగా.. చంద్రబాబును రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రులు యధేచ్చగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్తున్నారు. తాము హైదరాబాద్ వచ్చామని.. చెప్పుకోవడానికన్నట్లుగా ప్రెస్‌మీట్లు కూడా పెడుతున్నారు. విజయసాయిరెడ్డి లాంటి నేతలు.. ఉత్తరాంధ్రలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. సాయంపేరుతో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు.

మళ్లీ విజయవాడలో గంటట్లోనే ప్రత్యక్షమవుతున్నారు. జస్టిస్ కనగరాజ్‌ను తమిళనాడు నుంచి తీసుకొచ్చి ఎస్ఈసీగా ప్రమాణస్వీకారం చేయించారు.వీరెవరికి లాక్ డౌన్ వర్తించడం లేదు. క్వారంటైన్ నిబంధనలు అమలు చేయడం లేదు. వైసీపీ వాళ్లకు.. ప్రభుత్వం కావాలనుకున్న వారు మాత్రం.. సులువుగా అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నారు. విరాళాలివ్వడానికి హైదరాబాద్ నుంచి రోజూ పది మందికిపైగా ఏపీకి వస్తున్నారు. నేరుగా ముఖ్యమంత్రినే కలుస్తున్నారు. ఓ వైపు ఇలా చేస్తూనే.. మరో వైపు ప్రతిపక్ష నేతలు ఎవరైనా జిల్లాలు దాటి వచ్చినా…చంద్రబాబు హైదరాబాద్ నుంచి వచ్చిన క్వారంటెన్ లో ఉండాలంటూ.. మంత్రులు సందర్భం లేకపోయినా రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు. లాక్ డౌన్ నిబంధనల ప్రకారం.. ప్రజల్ని రిస్క్‌లో పెట్టకూడదన్న ఉద్దేశంతో ప్రతిపక్ష నేతలందరూ ఎవరి ఇళ్లకు వారు పరిమితమయ్యారు.

తాము యధేచ్చగా లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నామని మీరు మాత్రం.. ఏపీలోకి వస్తే..క్వారంటెయిన్‌కు తరలిస్తామని రెచ్చగొట్టడం సామాన్యుల్ని సైతం ఆశ్చర్య పరుస్తోంది. ప్రభుత్వానికి ప్రజారోగ్యం కన్నా… లాక్ డౌన్ నిబంధనల ఉల్లంఘన జరిగేలా.. ప్రతిపక్షాన్ని రెచ్చగొట్టాలనే ఆలోచన చేస్తోందన్న అనుమానాలు రాజకీయ పార్టీల్లో వ్యక్తమవుతున్నాయి. లాక్ డౌన్ ఎత్తేసి ఎన్నికలు నిర్వహించాలన్న పట్టుదలతో ప్రభుత్వం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి సమయంలో.. లాక్ డౌన్ ఉల్లంఘించాలంటూ.. మంత్రులు సవాళ్లు చేయడం.. అనుమానాస్పదంగా మారిందంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close