‘సవ్యసాచి’కి మాధవన్‌ పెట్టిన కండిషన్!

‘సఖి’, ‘చెలి’, ‘యువ’… మాధవన్‌ నటించిన తమిళ సినిమాలు మ్యాగ్జిమమ్‌ తెలుగులోకి డబ్బింగ్‌ అయ్యాయి. హిట్టయ్యాయి. మాధవన్‌కి తెలుగులో చాలామంది అభిమానులు ఉన్నారు. కానీ, ‘సవ్యసాచి’ ముందు వరకూ ఒక్క స్ట్రయిట్‌ తెలుగు సినిమాలో నటించలేదు. ‘ఓం శాంతి’లో నటించినా… అది అతిథి పాత్రే. అక్కినేని నాగచైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించిన ‘సవ్యసాచి’లో విలన్‌గా నటించాడు. ఓ రకంగా ఈ సినిమాతో తెలుగులోకి మాధవన్‌ రీఎంట్రీ ఇస్తున్నారు. ఇంతకు ముందు ‘యువ’లో మాధవన్‌ నెగిటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ చేశాడు. ఈ సినిమాలో పూర్తిస్థాయి విలన్‌ రోల్‌ చేశాడు.

‘సవ్యసాచి’లోని రోల్‌లో నటించడానికి ముందు ‘సవ్యసాచి’ టీమ్‌కి ఒక కండిషన్ పెట్టారు. దానికి సరేనంటేనే సినిమా చేస్తానని చెప్పార్ట! అదేంటంటే… ‘‘సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేయకూడదు’’ అని! అందుకు దర్శకుడు, నిర్మాతలు సరేనని ఒప్పుకున్నారు. సినిమా చేశారు. అందుకని సినిమాను తమిళంలో డబ్బింగ్‌ చేయలేదు. రెగ్యులర్‌ తెలుగు సినిమాల తరహాలో చెన్నై, తమిళనాడులో ఇతర ఏరియాల్లో ‘సవ్యసాచి’ తెలుగు వెర్షన్‌ విడుదల చేస్తున్నారు. సాధారణంగా పరభాషా నటీనటులు తెలుగు సినిమాల్లో ప్రధాన పాత్రల్లో నటిస్తే… ఆ భాషలో డబ్బింగ్‌ చేసి విడుదల చేయడం ద్వారా నిర్మాతలకు కొంత లాభం వస్తుంది. అయితే… ‘సవ్యసాచి’ని తమిళంలో విడుదల చేస్తే, తను హీరోగా చేసే సినిమాలపై, కెరీర్‌పై ఎఫెక్ట్‌ పడుతుందని మాధవన్‌ భావించడంతో దర్శక నిర్మాతలు సరేనని అనక తప్పలేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close