బాబా రామ్‌దేవ్‌కు ఏకపక్షంగా 600 ఎకరాలు ధారాదత్తం

హైదరాబాద్: యోగా గురు బాబా రామ్‌దేవ్‌ నడుపుతున్న పతంజలి యోగపీఠ్‌ సంస్థకు మహారాష్ట్ర ప్రభుత్వం భారీస్థాయిలో 600 ఎకరాల భూమిని కేటాయించటం వివాదాలకు దారితీసింది. నారింజపళ్ళ ప్రాసెసింగ్ ప్లాంట్, ఆయుర్వేద ఉత్పత్తుల యూనిట్‌ల స్థాపనకోసం ప్రభుత్వం ఈ భూమిని కేటాయించింది. కేంద్ర ఉపరితల రవాణాశాఖమంత్రి నితిన్ గడ్కరి, మహారాష్ట్ర మంత్రి చంద్రశేఖర్ బవంకులే, పతంజలి యోగపీఠ్‌కు చెందిన బాలకృష్ణ ఇటీవల ఈ భూమి కేటాయింపుకు సంబంధించి ఒక అవగాహనా ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందం ప్రకారం మహారాష్ట్ర ప్రభుత్వం నాగపూర్ జిల్లాలో 200 ఎకరాలు, మిహాన్ ప్రాంతంలోని సెజ్‌లో 400 ఎకరాలను మహారాష్ట్ర ప్రభుత్వం పతంజలి యోగపీఠ్ సంస్థకు కేటాయించింది. ప్రభుత్వ చర్యపై మహారాష్ట్ర ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ప్రభుత్వం తన ఇష్టమొచ్చినవారికి ఇలా కారుచౌకగా భూమిని కేటాయించటమేమిటని ప్రశ్నించాయి. నిజంగా పరిశ్రమలు స్థాపించేవారికి భూమిని ఇవ్వాలనుకుంటే ప్రకటనలు ఇవ్వటం, టెండర్‌లు జారీచేయటం చేసి ఉండేదని ఆరోపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close