ప్రజాఫ్రంట్ – అవినీతిపై విచారణ, ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీ..!

రైతులకు ఏక కాలంలో రూ. 2 లక్షల రుణమాఫీని ప్రజాకూటమి ప్రకటించారు. కూటమి నేతలు ఉత్తమ్, ఎల్ .రమణ, కోదండరాం. పల్లా వెంకటరెడ్డి.. తెలంగాణ ప్రజాఫ్రంట్ కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని విడుదల చేశారు. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీతో పాలు ఆకర్షక పథకాలను ఇందులో ప్రకటించారు. వృద్ధులు, ఒంటరి మహిళలు, వితంతువులు, చేనేత, బీడీ కార్మికులకు రూ.2 వేల పెన్షన్‌, పెన్షనర్ల అర్హత వయసు 60 నుంచి 58కి తగ్గింపు, వికలాంగులకు రూ.3 వేల పెన్షన్‌ ఇస్తామని ప్రకటించారు. ఒక కుటుంబంలో ఇద్దురు పెన్షన్ కు అర్హత సాధిస్తే ఇద్దరీ పెన్షన్ ఇస్తామని సీఎంపీలో హామీ ఇచ్చారు. కేసీఆర్‌లా కుటుంబంలో ఒకరికి పెన్షన్‌ ఇచ్చి… భార్యాభర్తల మధ్య తగువులు పెట్టబోమని ఉత్తమ్‌ వ్యాఖ్యానించారు.

కర్నాటక తరహాలో అవినీతి నిరోధానికి ప్రత్యేక లోకాయుక్త ఏర్పాటు చేస్తామని కోదండరామ్‌ ప్రకటించారు. భారీ కాంట్రాక్టుల్లో అవినీతిపై విచారణ చేయిస్తామన్నారు. పంచాయతీరాజ్‌ వ్యవస్థను బలోపేతం చేస్తామని.. తెలంగాణ ఉద్యమకారులపై కేసులన్నీ ఎత్తివేస్తామని ప్రకటించారు. తొలిదశ ఉద్యమకారులకు పెన్షన్‌ ఇచ్చే అంశంపై ఆలోచిస్తున్నామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళలకు పాలనలో భాగస్వామ్యం ఉంటుందని.. టీజేఎస్ అధినేత కోదండరామ్‌ తెలిపారు. ఈబీసీ వర్గాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారు. అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోపు లక్ష ఉద్యోగాల భర్తీ, కాంట్రాక్ట్, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు సమానపనికి సమాన వేతనం ఇస్తామని కోదండరాం హామీ ఇచ్చారు సంప్రదాయ వృత్తుల పరిరక్షణకు బోర్డు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధర, ధరల స్థిరీకరణ నిధి, చిన్న సన్నకారు రైతులకు బీమా సౌకర్యం కూడా ప్రకటించారు.

విద్యారంగం విషయంలోనూ కొన్ని కీలకమైన విషయాలను ప్రకటించారు. ప్రతి నియోజకవర్గంలో డిగ్రీ, జూనియర్‌ కాలేజీ ఏర్పాటు, పాఠశాల విద్య బలోపేతం కోసం స్వయం ప్రతిపత్తికలిగిన కమిషనరేట్‌ ఏర్పాటు చేస్తామన్నారు. పాత విధానంలోనే విద్యుత్‌ చార్జీలు ఉంటాయని కోదండరామ్‌ ప్రకటించారు. ఇంటి పన్ను క్రమబద్దీకరణ, సింగరేణికి అనుబంధంగా చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రజాకూటమి అధికారంలోకి వస్తే.. సింగరేణిలో ఓపెన్‌ కాస్ట్‌ ఉండదని హామీ ఇచ్చారు. నాలుగేళ్లలో అన్ని వ్యవస్థలు చిన్నాభిన్నమయ్యాయని అవినీతి నిర్మూలన ప్రత్యేక అంశంగా ఉంటుందని కోదండరాం హామీ ఇచ్చారు. ఇన్నాళ్లు హైదరాబాద్‌ కేంద్రంగానే అభివృద్ధి జరిగిందని హైదరాబాద్‌తో పాటు జిల్లాల అభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తామని.. ఈ సీఎంపీకి.. కోదండరాం చైర్మన్ గా ఉంటారు.

[pdf-embedder url=”https://www.telugu360.com/te/wp-content/uploads/sites/2/2018/11/Peoples-front-manifesto-2018.pdf” title=”People`s front manifesto 2018″]

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close