ఈ సినిమా మ‌హేష్ చేయాల్సిందా??

అ.ఆ అన్నిచోట్లా హౌస్‌ఫుల్స్‌తో న‌డుస్తోంది. టీమ్ అయితే ఫుల్ హ్య‌పీ. నితిన్ కెరీర్‌లో మ‌రో భారీ హిట్ ప‌డిపోయిన‌ట్టే. అయితే.. ఈ హిట్‌.. మ‌హేష్ బాబు ఖాతాకి చేరాల్సింద‌ట‌. అదెలాగంటే… ఈసినిమా ముందు మ‌హేష్ బాబు ద‌గ్గ‌ర‌కే వెళ్లింద‌ట‌. మ‌హేష్ – త్రివిక్ర‌మ్ ల‌ది సూప‌ర్ హిట్ కాంబినేష‌న్‌. అత‌డు, ఖ‌లేజాల‌తో ఆక‌ట్టుకొన్నారు. మ‌రో సారి క‌ల‌సి ఓ సినిమా చేద్దామ‌ని ఎప్ప‌టినుంచో అనుకొంటున్నారు. ఆ ద‌శ‌లో త్రివిక్ర‌మ్ అ.ఆ క‌థ మ‌హేష్‌కి వినిపించిన‌ట్టు స‌మాచారం. అయితే.. ప్ర‌స్తుతం ఉన్న క‌థ‌లో కాస్త ల‌వ్‌, ఇంకాస్త హీరోయిజం యాడ్ చేశాడ‌ట‌.

అయితే మ‌హేష్ మాత్రం ఈ క‌థ‌ని సున్నితంగా తిరస్క‌రించిన‌ట్టు తెలుస్తోంది. ”మ‌న‌దిద్ద‌రి కాంబినేష‌న్ అంటే జ‌నంలో చాలా అంచనాలు ఉంటాయి. ఆ అంచ‌నాల‌కు త‌గిన క‌థ దొరికిన‌ప్పుడు చేద్దాం” అని త‌ప్పుకొన్నాడ‌ట‌. ఆ త‌ర‌వాతే ఈసినిమాని నితిన్‌కి త‌గిన‌ట్టు మారింద‌ని చెబుతున్నారు. మొత్తానికి.. మ‌హేష్ చేయాల్సిన సినిమా నితిన్ వైపుకొచ్చింద‌న్న‌మాట‌. ఒక‌వేళ ఇదే క‌థ‌ని మ‌హేష్‌తో తీస్తే… వ‌ర్క‌వుట్ కాక‌పోయేది కూడానూ. ఎందుకంటే ఈ సినిమాలో నితిన్ పాత్ర‌కంటే స‌మంత డామినేష‌నే ఎక్కువ క‌నిపిస్తుంది. సో… మ‌హేష్ నిర్ణ‌యం క‌రెక్టేఅన్న‌మాట‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close