క్రైమ్: మార్ఫింగ్ ఫోటోతో ఎంపీకే బెదిరింపులు..! మంచిర్యాలలో బ్లాక్‍మెయిల్ సిస్టర్స్ ..!!

క్రైమ్: మార్ఫింగ్ ఫోటోతో ఎంపీకే బెదిరింపులు..! మంచిర్యాలలో బ్లాక్‍మెయిల్ సిస్టర్స్ ..!!

పెద్దపల్లి టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం సృష్టించాయి.వారు ప్రధానికి కూడా ఫిర్యాదు చేశారనే ప్రచారం జరగడంతో.. మరింత ఆసక్తి రేకెత్తించాయి. కానీ చివరికి..ఇదంతా మంచిర్యాలకు చెందిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు చేస్తున్న బ్లాక్ మెయిలింగ్ గా పోలీసులు తేల్చారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని నంది నగర్ లోని ఓ అపార్ట్ మెంట్ లో .. సంధ్య, విజిత అనే ఇద్దరు మహిళలు మరో ఇద్దరు యువకులతో కలసి చొరబడి గలాటా సృష్టించారు. దీనిపై ఎంపీ సుమన్ సహాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత సంధ్య అనే అమ్మాయితో బాల్క సుమన్ చనువుగా ఉన్న ఫోటోలు వైరల్ అయిపోయాయి. ఈ ఫోటోలు మంచిర్యాల పోలీసుల దృష్టికి వెళ్లడంతో ఆశ్చర్యపోయారు. ఎందుకంటే.. సంధ్యతో పాటు ఆమె సోదరి విజతపై…ప్రముఖులను ట్రాప్ చేసి బెదిరించిన కేసులు గతంలో చాలా నమోదయ్యాయి. ప్రముఖులను లక్ష్యంగా చేసుకుని సంధ్య, విజిత అనే అక్కాచెల్లెళ్లు ఎనిమిదేళ్లుగా పెద్దపల్లి, గోదావరిఖని, చంద్రాపూర్‌లలో పలువురిని బ్లాక్‌మెయిల్‌ చేశార మంచిర్యాల సీఐ ప్రకటిచారు. ఎంపీ సుమన్ తన భార్య, పిల్లలతో ఉన్న ఫోటోను ఫేస్‌బుక్‌లో పెట్టారు. ఆ ఫో టోను డౌన్ లోడ్ చేసుకుని .. భార్య స్థానంలో తన ఫోటోను ఉంచారు సంధ్య. ఆ తర్వాత బ్లాక్ మెయిలింగ్ ప్రారంభించారు. సుమన్ అనుచరులు సంధ్య, విజితలపై జనవరి 27న ఎంపీ బాల్క సుమన్‌ అనుచరులు ఫిర్యాదు చేశారని.. విచారణలో వీరికి సంబంధించి విషయాలు వెలుగులోకి వచ్చాయని సీఐ ప్రకటించారు. మొత్తానికి బాల్క సుమన్ లైంగిక వేధింపుల విషయం… సచలనం సృష్టించింది. ఈ మొత్తంలో అసలేం జరిగిందో… మరిన్ని వివరాలు త్వరలోనే బయకు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close