కార్తి హీరోగా మణిరత్నం భారీ సినిమా

ఎన్నో రోజులుగా మణిరత్నం తర్వాత సినిమా గురించి ఎదురుచూస్తున్న ప్రేక్షకులకు, అభిమానులకు ఇది ఒక రకంగా సంతోషించదగ్గ వార్త కావొచ్చు. ఓకే కణ్మణి తర్వాత ఏ సినిమా కమిట్ అవ్వని మణిరత్నం ఎట్టకేలకు సినిమా కన్ ఫర్మ్ చేశారు. టాలీవుడ్, కోలీవుడ్ లో ఒకే ఇమేజ్ ఉన్న యువ నటుడు కార్తి హీరోగా మణిరత్నం ఓ బైలింగ్వల్ మూవీ చేస్తున్నారు.

ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్ పూర్తి చేసుకుని జూలైలో మొదలవనున్నదని కోలీవుడ్ టాక్. కార్తికి జంటగా ఈ సినిమాలో మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమమ్ హీరోయిన్ సాయి పల్లవి నటిస్తుండటం విశేషం. సినిమాలో కార్తిని మునుపెన్నడు చూడని కొత్త అవతారంలో ప్రెజెంట్ చేస్తున్నారట మణిరత్నం.

ఏ.ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో మిగతా స్టార్ కాస్ట్ కూడా చాలా పెద్దదిగా ఉంటుందని తెలుస్తుంది. మణిరత్నం దర్శకత్వంలో యువ సినిమాకు ఆయన సహాయక దర్శకత్వ శాఖలో పనిచేసిన కార్తి ఇప్పుడు ఆయన దర్శకత్వంలో సినిమా చేయడం విశేషం. ఇక ఈ సినిమాకు సంబందించిన మిగతా విషయాలు త్వరలో తెలిసే అవకాశాలు ఉన్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close