‘ఆకతాయి’గా మెగా హీరో..!

మెగా వారసుల్లో అభిమానులకు త్వరగా దగ్గరైంది మాత్రం సాయి ధరం తేజ్ అనే అనాలి. ముందు ‘రేయ్’ సినిమా చేసినా ‘పిల్లా నువ్వు లేని జీవితం’ రిలీజ్ అయ్యి హిట్ అవడంతో సాయి ఫుల్ క్రేజ్ సంపాదించాడు. మేనమామ మేనరిజాలను కూడా పలికిస్తూ హిట్స్ కొడుతున్న సాయి ధరం తేజ్ త్వరలో ‘సుప్రీం’ సినిమాతో రాబోతున్నాడు. దిల్ రాజు నిర్మాణంలో అనీల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమా తో పాటే చేస్తున్న సాయి ‘తిక్క’ సినిమా కూడా మరో నెల గ్యాప్ తో వచ్చేందుకు సిద్ధంగా ఉంది.

ఇక ఈ రెండు సినిమా తర్వాత తను చేయబోయే సినిమాకు రెడీ అవుతున్నాడు ఈ మెగా హీరో. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న సాయి ధరం తేజ్ ఆ సినిమా షూట్ లో త్వరలో పాల్గొనున్నాడు. ఈ సినిమాకు ‘ఆకతాయి’ అనే టైటిల్ పరిశీలణలో ఉన్నట్టు సమాచారం. లాస్ట్ ఇయర్ సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాతో హిట్ అందుకున్న సాయి ధరం తేజ్ మరి రాబోతున్న సినిమాతో కూడా అదే హిట్ మేనియాను కంటిన్యూ చేస్తాడో లేదో చూడాలి. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో ఉన్న ఆకతాయి (వర్కింగ్ టైటిల్) త్వరలో మొదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక సినిమాలో మిగతా కాస్ట్ అండ్ క్రూ గురించి త్వరలో చిత్రయూనిట్ వెల్లడిస్తారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at [email protected]