ఈ వారం సినిమాలకు తుపాను గండం !

సినిమాలకి ‘సంక్రాంతి’ పండగ లాంటి సీజన్. అయితే అది ఈసారి సినిమాల పండగ డిసెంబర్ నుంచే మొదలైయింది. డిసెంబర్ 1న యానిమల్ భారీ మూవీగా వచ్చింది. ప్రభాస్ సలార్ 22కి సిద్ధంగా వుంది. ఈ వారం కూడా రెండు ప్రామెసింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాయి. నాని ‘హాయ్ నాన్న’, నితిన్ ‘ఎక్స్‌ట్రా’ర్డినరీ మ్యాన్. హాయ్ నాన్న గురువారం వస్తుంటే.. నితిన్ శుక్రవారం వస్తున్నారు. అయితే ఈ రెండు సినిమాలకి తుపాను ఎఫెక్ట్ పడుతోంది.

మిగ్‌జాం తుపాను కోస్తా ఆంధ్రపై తీవ్ర ప్రభావం చూపుతోంది. తుపాను గమనం క్షణాల వ్యవధిలో పెను ప్రభావాన్ని చూపిస్తోందని వాతావరణ ఇప్పటికే రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. తుపాను ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వైజాగ్ తో పాటు చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, బాపట్ల, కృష్ణా జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయి. పంటల నష్టం తీవ్రంగా వుంది. భారీ వృక్షాలు , విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. ఇప్పటికే విమాన, బస్సు సర్వీసులు కూడా రద్దయ్యాయి. ఇంటికి బయటికి రాకూడదనే హెచ్చరిలు జారీ చేశారు అధికారులు. తుపాన్ ప్రభావంతో తెలంగాణలో కూడా కొన్ని చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుపాన్, వర్షాల తీవ్రత ఎప్పటివరకూ కొనసాగుతుందనే ఇంకా స్పష్టత రాలేదు.

ఈ ఇలాంటి ప్రతికూల సమయంలో వస్తున్న సినిమాపై ఖచ్చితంగా ఎంతో కొంత ఈ ప్రభావం వుంటుందనే చెప్పాలి. ముఖ్యంగా నాని సినిమాలకి వైజాగ్ లో మంచి ఆదరణ వుంటుంది. ఇటివలే అక్కడ జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్ లో ‘నేను ఏ జోనర్ సినిమా చేసినా గొప్ప ఆదరించింది వైజాగ్ ప్రాంతమే’ అని స్వయం చెప్పారు నాని. మరి కోస్తాలో మిగ్‌జాం తుపాను తీవ్రత సినిమాలపై ఎంతలా వుంటుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close