బన్నీ వాస్ సమర్పకుడిగా నిర్మించిన సినిమా ‘మిత్రమండలి’. ప్రియదర్శి, రాగమయూర్, ప్రసాద్ బెహరా కీలక పాత్రలు పోషించారు. టీజర్ ఈరోజు విడుదలైంది. టీజర్ అంతా పంచ్ పటాకులే. డైలాగులు గమ్మత్తుగా ఉన్నాయి. క్యారెక్టరైజేషన్లు కూడా ఫన్నీగా ఉన్నాయి. బ్యాటూ, బాలూ లేకుండా క్రికెట్ ఆడేస్తున్న మిత్రుల గురించి ఇచ్చిన రన్నింగ్ కామెంట్రీ నవ్వులు పంచింది.
ఈ బ్యాట్స్‌మెన్‌పైనే అన్ని హౌప్స్ పెట్టుకొన్న బౌలింగ్ టీమ్
అండర్ 19లో 20 ఏళ్లుగా ఆడుతున్న స్పిన్ బౌలర్
ఈ ఫీల్డర్ తెలివిగా బౌండరీని వదిలేసి తన బంతుల్ని కాపాడుకొంటున్నాడు
టాస్ గెలిచి తెలివి తక్కువగా బౌలింగ్ ఎంచుకోకుండా, ఫీల్డింగ్ ఎంచుకొంది..
– ఇలా సరదాగా సాగిపోయింది రన్నింగ్ కామెంట్రీ. దీన్ని బట్టి టీజర్ ఎలా ఉందో, సినిమా ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవొచ్చు. ఇంపాక్ట్ ప్లేయర్ గా సత్య రంగంలోకి దిగాడు. తన కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోచ్చు. ఎస్.ఐగా వెన్నెల కిషోర్ ఉండనే ఉన్నాడు. మొత్తానికి ఈ వానాకాలంలో వినోదాల జల్లు కురిపించడానికి మిత్రమండలి సిద్ధంగా ఉందన్న విషయం ఈ టీజర్ తో అర్థమవుతోంది. ఎందుకో.. ఈ టీజర్ చూస్తుంటే జాతిరత్నాలు వైబ్స్ కనిపిస్తున్నాయి. అది కూడా తిక్క తిక్క కామెడీతో సక్సెస్ కొట్టిన సినిమానే. మరి మిత్రమండలి ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. విజయేందర్ ఈ చిత్రానికి దర్శకుడు.