మోడీ మార్క్ : విదేశాల్లో సంపాదించుకున్నా ఇక్కడ పన్ను..!

పన్నులు పిండుకోవడంలో కేంద్ర ప్రభుత్వ శైలి చాలా భిన్నంగా ఉంటోంది. ఆదాయపు పన్ను ఊరట ఇచ్చామని భ్రమ కల్పించిన కేంద్రం.. చివరికి పిండుకుందని లెక్క తేలింది. ఆ ట్విస్టుల్లో ఇంకో ట్విస్ట్.. ఎన్నారైలపై ఆదాయపు పన్ను విధించడం. ఇండియాలో ఉపాధి దొరక్క.. ఇతర దేశాలకు వెళ్లిన వారు అక్కడ ఆదాయం సంపాదించినా… ఇండియాలో పన్ను విధించాలన్న నిర్ణయానికి.. బీజేపీ వచ్చింది. అయితే.. ఇక్కడో చిన్న వెసులుబాటు ఇచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ… డబ్బులు సంపాదిస్తూ.. అక్కడ ఎలాంటి ఆదాయపు పన్ను కట్టకపోతే మాత్రమే.. ఇండియాలో వసూలు చేయాలని నిర్ణయించుకున్నారు. దాదాపుగా ప్రతీ దేశం.. ఇలా .. తమ దేశంలో సంపాదించుకున్న వారందరి దగ్గర నుంచి ఆదాయపు పన్ను వసూలు చేస్తాయి. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం.. ఇందుకు మినహాయింపు.

ఆ దేశాల్లో ఎలాంటి ఆదాయపు పన్ను.. ఎవరిపైనా విధించరు. దాంతో.. పన్ను పోటు అక్కడ ఉండదు. అక్కడకు వెళ్లి డబ్బులు సంపాదించుకుంటున్న భారతీయులపైనే… మోడీ సర్కార్ కన్ను పడింది. పన్నుల్లేకుండా.. వదిలి పెట్టడం తమకు ఇష్టం లేదనుకుంది. వెంటనే.. బడ్జెట్‌లో నిర్ణయం ప్రకటించింది. నేరుగా గల్ఫ్ అని ప్రకటించకుండా… ఇతర దేశాల్లో ఆదాయపు పన్ను చెల్లించని వారు అనే క్లాజ్ చేశారు. అంటే.. గల్ఫ్ దేశాలని మాత్రమే అర్థం. పొట్టచేత పట్టుకుని గల్ఫ్ దేశాలకు వెళ్లిన వారిలో అత్యధికులు.. చిన్నా చితకా పనులు చేసుకుని బతికేవారు. కాస్త అధిక వేతనం వస్తుందని… ఇక్కడ ఏజెంట్లకు లక్షలకు లక్షలు చెల్లించి వెళ్తూంటారు. వారందరి ఆదాయంపైనా… గల్ఫ్ దేశాలు కాకుండా.. మోడీ సర్కారే పన్ను విధించబోతోంది. గల్ఫ్‌లో అత్యధికులు… కేరళకు చెందిన వారుఉంటారు.

విదేశాల్లో ఉద్యోగాలు చేసి.. ఇండియాకు విదేశీ మారకద్రవ్యం పంపుతున్న వారిలో అత్యధికులు కేరళవారే. 70 శాతం ఇలాంటి విదేశీ మారకద్రవ్యం కేరళకు చెందుతుంది. గల్ఫ్ ఆర్థిక వ్యవస్థలో వీరు కీలక భాగస్వాములు. వీరిపై… మోడీ సర్కార్.. పన్ను విధింపుతో పంజా విరసబోతోందని… తాజా ప్రకటనతో స్పష్టమయిందంటున్నారు. తమకు ఓటు బ్యాంక్ .. బేస్ లేని రాష్ట్రాలను బీజేపీ ప్రత్యేకంగా టార్గెట్ చేస్తోందన్న అభిప్రాయం.. ఈ నిర్ణయంతో ఏర్పడుతోందంటున్నారు. దేశంలో సంపాదించుకుంటున్నారు కాబట్టి… పన్ను అడిగితే అర్థం ఉంటుంది కానీ… ఇతర దేశాల్లో సంపాదించుకున్నా… ఇండియాలో ఆదాయపు పన్ను కట్టమని అడగడం.. అసలు అలాంటి ఆలోచన రావడమే….. ఘోరమన్న చర్చ జరుగుతోంది. దీనిపై కేంద్రం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

2గంటల్లో భారీ వర్షం.. హైదరాబాద్ బీ అలర్ట్..!!

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. సిద్ధిపేట, సంగారెడ్డి, మెదక్ , సిద్దిపేట, వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల,రంగారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. గురువారం ఉదయం ఎండలు భగ్గుమనగా మధ్యాహ్నం వాతావరణం ఒక్కసారిగా...

ట్యాక్సుల‌పై నిర్మ‌ల‌మ్మ‌కు డైరెక్ట్ పంచ్… వీడియో వైర‌ల్

ఒకే దేశం- ఒకే పన్ను అని కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీసుకొచ్చిన జీఎస్టీ సామాన్యుల పాలిట గుదిబండగా మారిందన్న విమర్శలు వస్తుండగా.. తాజాగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఓ వ్యక్తి...

ఐప్యాక్ ఆఫీస్‌కు వెళ్లింది ప్రశాంత్ కిషోర్‌కు కౌంటర్ ఇవ్వడానికా ?

ఐప్యాక్ తో కాంట్రాక్ట్ రద్దు చేసుకున్న వైసీపీ అధినేత జగన్ చివరి సందేశం ఇవ్వడానికి వారి ఆఫీసుకు వెళ్లారు. గతం కన్నా ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పుకొచ్చారు. అంత వరకూ బాగానే ఉంది...

చిరు, ప్ర‌భాస్‌, బ‌న్నీ.. ఒకే వేదిక‌పై!

మే 4... దాస‌రి జ‌న్మ‌దినం. ఈ సందర్భంగా ఓ భారీ ఈవెంట్ నిర్వ‌హించాల‌ని అనుకొంది ద‌ర్శ‌కుల సంఘం. అందుకోసం ఏర్పాట్లూ జ‌రిగాయి. అయితే ఎల‌క్ష‌న్ కోడ్ అడ్డురావ‌డంతో ఈ ఈవెంట్ వాయిదా ప‌డింది....

HOT NEWS

css.php
[X] Close
[X] Close