మళ్ళీ విదేశీయాత్రకు బయలుదేరిన మోడి

హైదరాబాద్: ప్రధాని పదవి చేపట్టిన దగ్గరనుంచి వరసగా చేస్తున్న విదేశీయాత్రల గురించి ఎన్ని విమర్శలు వ్యక్తమవుతున్నా నరేంద్ర మోడి వాటిని ఏమాత్రం పట్టించుకుంటున్నట్లుగా లేదు. తన దారి తనదే అనే టైపులో సాగిపోతున్నారు. ఇటీవల బీహార్ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజు కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధి మీడియాతో మాట్లాడుతూ, నరేంద్రమోడి విదేశీయాత్రలు, ఊకదంపుడు ఉపన్యాసాలు కట్టిపెట్టి ఇకనైనా పని ప్రారంభించాలని చురకలు అంటించిన సంగతి తెలిసిందే.

మూడు రోజుల పర్యటనకోసం మోడి ఈ ఉదయం బ్రిటన్ బయలుదేరి వెళ్ళారు. ప్రధాని హోదాలో ఆయన బ్రిటన్ పర్యటించటం ఇదే మొదటిసారి. యూకే వెళుతున్నానని, తన పర్యటన భారత్, యూకే మధ్య ఆర్థిక సంబంధాలను మరింత పటిష్ఠం చేస్తాయని మోడి ఈ ఉదయం ట్విట్టర్‌లో పేర్కొన్నారు. మరిన్ని పెట్టుబడులు భారత్‌కు వస్తాయని ట్వీట్ చేశారు. లండన్ చేరగానే మొదట ఆ దేశ ప్రధాని డేవిడ్ కేమరూన్ అధికార నివాసం – 10, డౌనింగ్ స్ట్రీట్‌కు వెళ్ళి ఆయనతో మోడి చర్చలు జరుపుతారు. తర్వాత పార్లమెంట్‌కు వెళ్ళి అక్కడ మహాత్మా గాంధి విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత పార్లమెంట్‌లో మాట్లాడతారు. రాత్రికి బకింగ్‌హామ్‌‍షైర్‌లో ప్రధాని కేమరూన్ నివాసంలో ఆయన ఆతిథ్యం స్వీకరిస్తారు. శుక్రవారం లండన్‌లో సీఈఓల సమావేశం ఒకదానిలో పాల్గొంటారు. శనివారం లండన్ నుంచి అంకారా వెళ్ళి జీ-20 సదస్సులో మోడి పాల్గొననున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close