59 నిమిషాల్లో లోన్..రూ. వెయ్యి కోట్ల స్కాం..! మోడీ మాయ…!!

ప్రధానమంత్రి నరేంద్రమోడీ… కొద్ది రోజుల క్రితం.. చిన్న, మధ్య తరహా పారిశ్రామికవేత్తలు, వ్యాపారుల కోసం.. ఓ పథకం ప్రకటించారు. అదేమిటంటే.. 59 నిమిషాల్లోనే రుణం. వినడానికే ఎంతో హాయిగా ఉన్న పథకం… కేంద్రంగా.. రూ. వెయ్యి కోట్ల స్కాం జరిగింది. ఇదంతా… మోడీ స్నేహితులకే వెళ్లిందని… కొత్త ఆధారాలు బయటపడుతున్నాయి. ముందే అప్పు తీసుకుని చిన్నతరహా కంపెనీలు స్థాపించిన వారికి కూడా కొత్త రుణం ఇస్తామన్నారు. దీంతో చిన్న పరిశ్రమల స్థాపకులు ఆనందంలో మునిగిపోయారు. రెండోసారి లోన్ తీసుకునే వారికి రెండు శాతం రాయితీ అంటూ కొత్త తాయిలం పడేశారు. మోడీ దేవుడని.. రుణం రాక ముందే మొక్కుకున్నారు.

అలా మొక్కుని ఊరుకోరుగా.. దరఖాస్తు చేసుకున్నారు కూడా. కొంతమందికైతే దరఖాస్తు చేసుకున్న 47 నిమిషాల్లోనే లోన్ మంజురైనట్లు సమాచారం వచ్చింది. ప్రింటవుట్ తీసుకుని సంబంధిత బ్యాంకుకు వెళితే మాత్రం అసలు సంగతి తెలుసుకుని లబో దిబో మనక తప్పలేదు. బ్యాంకులు చెప్పిన సమాధానం చూస్తే దరఖాస్తుదారులకు దిమ్మ తిరిగింది. పూచికత్తు లేకుండా ఎవరైనా లోన్ ఇస్తారా అని బ్యాంక్ అధికారులు ఎదురు ప్రశ్న వేశారు. కోటి రూపాయలు లోన్ ఇచ్చేందుకు తాము సిద్దమేనని అయితే ఆ కోటి రూపాయలకు పూచికత్తు తీసుకొచ్చినప్పుడే ప్రాసెసింగ్ ప్రక్రియ పూర్తి చేసి లోన్ బట్వాడా ప్రక్రియ ప్రారంభిస్తామని బ్యాంకుల అధికారులు తేల్చేశారు. ఈ వ్యవహారంలో ఏదో మతలబు ఉందని.. చాలా మందికి అర్థం అయిపోయింది. మోడీ అలా 59 నిమిషాల్లో లోన్ అని ప్రకటించిన తర్వాత రుణం కోసం కోటి మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇంకా ఎవరికీ లోన్ మంజూరు కాకపోయినా లోన్ ఆమోదం పొందినట్లు సమాచారం వచ్చింది. అది సూత్రప్రాయమైన అంగీకారం మాత్రమేనని బ్యాంకులు ఇప్పుడు తేల్చేశాయి. ఇందుకోసం ప్రతీ దరఖాస్తుదారుడు, దరఖాస్తు రుసుము కింద 1,180 రూపాయలు చెల్లించేశాడు. పబ్లిక్ రంగ బ్యాంకులే లోన్ మంజూరు చేస్తున్నప్పటికీ, ఆన్ లైన్లో దరఖాస్తు ప్రక్రియ మొత్తం క్యాపిటా వరల్డ్ అనే ప్రవేటు సంస్థ నిర్వహించింది. ప్రతీ దరఖాస్తుదారుడి నుంచి 1,180 రూపాయలు అంటే ఇప్పటికే వెయ్యి కోట్ల రూపాయలు ఆ సంస్థకు చేరిపోయాయి.

క్యాపిటా వరల్డ్ ఓనరు జినత్ వికాత్ షా. 2015లో ప్రారంభమయింది. ఇందులో పీకే అంటే.. ప్రశాంత్ కిషోర్.. జగన్ రాజకీయ వ్యూహకర్త.. అంతకు ముందు.. బీజేపీకి కూడా వ్యహకర్త… ఆయన టీంలోని కీలక మెంబర్…అఖిల్ హండా డైరక్టర్. అతను కంపెనీలో.. డైరక్టర్‌గా చేరిన మోడీకి 59 నిమిషాల లోన్ ఆలోచన వచ్చింది. 2015 -16 ఆర్థిక సంవత్సరంలో ఈ కంపెనీకి పైసా ఆదాయం లేదు. 2016-17లో ఈ కంపెనీకి 15,680 రూపాయలు మాత్రమే ఆదాయం వచ్చింది. అసలు భారీ స్థాయిలో ఇలాంటి ఆన్ లైన్ దరఖాస్తుల వ్యాపారాలు చేయాలనుకునే కంపెనీలకు గత మూడేళ్లలో యాభై కోట్ల ఆదాయం వచ్చి తీరాలి. నిబంధనలకు తుంగలో తొక్కి మరీ కంపెనీతో ఒప్పందం కుదుర్చుని ప్రజల దగ్గర రూ. వెయ్యి కోట్లు దోచి పెట్టారు. ఈ తరహా ఆన్ లైన్ మోసంలో నేరుగా.. మోడీ పాలు పంచుకోవడం.. ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close