వైసీపీలో చేరిన మోహన్ బాబు, విష్ణు..!

మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు… వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైదరాబాద్‌లోని జగన్ నివాసం లోటస్‌పాండ్‌లో మోహన్‌బాబుతో పాటు.. ఆయన కుమారుడు విష్ణుకు.. కండువా కప్పి… పార్టీలోకి ఆహ్వానించారు జగన్మోహన్ రెడ్డి. ఫీజు రీఎంబర్స్‌మెంట్ పేరుతో.. గత వారం… చంద్రబాబుపై తీవ్రమైన ఆరోపణలు చేశారు మోహన్ బాబు. వైసీపీ కోసమే.. ఆయన ఇలా చేస్తున్నారని… ఎన్నికలకు ముందు ఇలా చేయడం ఏమిటన్న విమర్శలు టీడీపీ నుంచి వచ్చాయి. ఆయన చెప్పినట్లుగా.. ఫీజు రీఎంబర్స్‌మెంట్ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నది అబద్దమని.. ప్రభుత్వం రికార్డులు బయట పెట్టింది. ప్రభుత్వం మాత్రం నాలుగేళ్లలో రూ. 90 కోట్లు మోహన్‌బాబుకు చెందిన నాలుగు కాలేజీలు డ్రా చేసుకున్నాయని రికార్డులు మీడియాకు ఇచ్చింది.

ఆ తర్వాత ఈ నిధుల అంశంపై.. చర్చించని.. మోహన్ బాబు.. తన విద్యాసంస్థలపై కుట్ర జరుగుతోందని.. ఆరోపించారు. తనను రెచ్చగొడితే చంద్రబాబు బండారం బయట పెడతానని లేఖ విడుదల చేశారు. అదే సమయంలో.. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై .. చర్చకు రావాలని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు చేసిన సవాల్‌పై మాత్రం స్పందించలేదు. కానీ.. అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డిని కలిసి.. ఆ పార్టీలో చేరిపోయారు. నిజానికి ఈ సారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తాను కానీ.. తన బిడ్డల్లో ఒకరు కానీ… పోటీ చేయాలని అనుకున్నారు. దాని కోసం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సన్నిహిత సంబంధాలు కొనసాగించారు. మనోజ్‌కు ఆరు నెలల ముందుగానే .. తిరుపతికి పంపారు. ఓ సందర్భంలో.. నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి సీటును జగన్ ..మోహన్‌బాబుకు ఇస్తారని ప్రచారం జరిగింది. అయితే.. చివరికి ఏ టిక్కెట్ ఇవ్వలేదు.

అయితే… వైసీపీ వ్యూహంలో భాగంగా.. ఫీజు రీఎంబర్స్‌మెంట్‌పై.. ఆందోళన చేశారు. దాని కోసం.. విద్యార్థుల్ని రోడ్డుపైకి తెచ్చారు. దీంతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్నారు. ఇప్పుడు… ముద్ర పడిపోయింది కాబట్టి.. విడిగా ఉండటం కన్నా… వైసీపీలో ఉండటం బెటరని భావించినట్లు తెలుస్తోంది. నిజానికి.. జగన్‌తో మోహన్‌బాబు కుటుంబానికి బంధుత్వం ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుల్లో ఒకరైన వైఎస్ సుధీకర్ రెడ్డి కుమార్తె వెరోనికాను.. మంచు విష్ణు పెళ్లి చేసుకున్నారు. అప్పట్నుంచి వారి మధ్య బంధం బలపడింది. చివరికి అధికారికంగా.. వైసీపీలో చేరిపోయారు. ఎన్టీఆర్ టైంలో.. ఓ సారి టీడీపీ తరపున రాజ్యసభ సభ్యత్వం దక్కించుకున్న మోహన్ బాబు.. ఆ తర్వాత టీడీపీకి దూరమయ్యారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close