‘ఎన్టీఆర్‌’లో బిగ్ స‌ర్‌ప్రైజ్‌

ఎన్టీఆర్ మ‌న‌వ‌డిగా, బాల‌కృష్ణ త‌న‌యుడిగా, నంద‌మూరి వార‌సుడిగా మోక్ష‌జ్ఞ తెరంగేట్రం ఎప్పుడు? అంటూ నంద‌మూరి అభిమానులు ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అన్నీ అనుకున్న‌ట్టే జ‌రిగితే.. ఈ యేడాదే మోక్ష‌జ్ఞ ఎంట్రీ ఉండేది. కానీ.. మోక్ష‌జ్ఞ మాత్రం కాస్త స‌మ‌యం అడిగిన‌ట్టు స‌మాచారం. త‌న‌ని బాగా ఇంప్రెస్ చేసిన క‌థలేవీ రాలేన‌ద్న కార‌ణంతోనే మోక్షూ అరంగేట్రం ఆల‌స్యం అవుతోంది. అయితే మోక్ష‌జ్ఞ కోసం క్రిష్ క‌థ‌ల్ని రాసుకుంటూనే ఉన్నారు. అందులో ఏదో ఒక‌టి ఓకే అయిపోవ‌డం ఖాయంగా కనిపిస్తోంది. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ బ‌యోపిక్‌తో క్రిష్ బిజీగా ఉన్నారు. కాబ‌ట్టి… మోక్ష‌జ్ఞ ఎంట్రీకి ఇంకా టైమ్ ఉన్న‌ట్టే. అయితే ఈలోగా మోక్ష‌జ్ఞ‌ని వెండి తెరపై చూసుకునే అవ‌కాశం ఉంది. ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో మోక్ష‌జ్ఞ‌ని చూపించాలిన బాల‌య్య భావిస్తున్నారు. అయితే ఈ విష‌యాన్ని ఆయ‌న ముందే చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేద‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర మూడు నాలుగు ద‌శ‌లో ఉంటుంది. బాల్యంలో, కౌమారంలో, య‌వ్వ‌నంలో, న‌డివ‌య‌స్కుడిగా ఆయ‌న్ని చూపిస్తారు. మోక్షుని కౌమార ద‌శ‌లో ఉన్న ఎన్టీఆర్‌గా చూపించాల‌ని బాల‌య్య ఫిక్స్ అయ్యార్ట‌. తాత క‌థ‌తో ఓ సినిమా తీస్తూ.. తాత‌గా తండ్రి న‌టిస్తున్న చిత్రంతో త‌న‌యుడు అరంగేట్రం చేయ‌డం నిజంగా ఓ అరుదైన అవ‌కాశం. అందుకే మోక్ష‌జ్ఞ ఎంట్రీకి ఇంత‌కంటే మంచి త‌రుణం లేద‌ని బాల‌య్య భావిస్తున్నార్ట‌. అయితే… ఈ విష‌యాన్ని చివ‌రి వ‌ర‌కూ గోప్యంగా ఉంచాల‌నుకుంటున్నారు. ఎన్టీఆర్‌లో అదే బిగ్ స‌ర్‌ప్రైజ్ ఎలిమెంట్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

HOT NEWS

css.php
[X] Close
[X] Close