టీజర్: నిజాన్ని ‘కస్టడీ’ లోకి తీసుకున్న నాగచైతన్య

నాగ చైతన్య, వెంకట్ ప్రభు కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం కస్టడీ. తాజాగా టీజర్ ని వదిలారు. ఈ టీజర్ లో నాగచైతన్య వాయిస్ ఓవర్ తో పాటు యాక్షన్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది.

‘’గాయపడిన మనసు ఆ మనిషిని ఎంత దూరం అయినా తీసుకెళుతుంది. అది ఇప్పుడు నన్ను తీసుకొచ్చింది ఓ యుద్ధానికి. ఇక్కడ నన్ను చావు వెంటాడుతుంది. అది ఎటు నుంచి వస్తుందో ఎప్పుడు వస్తుందో, ఎలా వస్తుందో నాకు తెలీదు. తెలుసుకోవాలని కూడా లేదు. ఎందుకంటే నా చేతిలో వున్న ఆయుధం ఒక నిజం. నిజం ఒక ధైర్యం. నిజం ఒక సైన్యం. యస్.. దట్ ట్రూత్ ఈజ్ ఇన్ మై కస్టడీ’’అంటూ సాగిన వాయిస్ ఓవర్ తగినట్లు విజువల్స్ ని పోస్ట్ చేసుకుంటూ వెళ్లారు.

కథ గురించి పెద్దగా క్లూ ఇవ్వకుండానే టీజర్ ని కట్ చేశారు. నాగ చైతన్య ఇంటెన్స్ రోల్ లో కనిపించాడు. యాక్షన్ ఎపిసోడ్స్ హైలెట్ గా వున్నాయి. దర్శకుడు వెంకట్ ప్రభు ఓ పోలీస్ కథని ఎంచుకున్నాడు. ఇలాంటి సీరియస్ కథ చేయడం చైతుకి కొత్తే. టీజర్ లో ఫ్రెష్ నెస్ కనిపించింది. ఇళయరాజ, యువన్ ఇద్దరూ కలసి ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. టీజర్ కట్ లో మాత్రం యువన్ మార్క్ కనిపించింది. మే 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

1 COMMENT

Comments are closed.