రెండు బీర్లూ.. చికెన్ బిరియానీ : నాగ్ స్పెష‌ల్ మెనూ

జీవితాన్ని ఆస్వాదిస్తూ గ‌డ‌ప‌డం ఎలాగో నాగార్జున‌కు బాగా తెలుసు. అందుకే ఎప్పుడూ రిలాక్స్డ్‌గా క‌నిపిస్తుంటారాయ‌న‌. త‌న అల‌వాట్లు కప్పిపుచ్చుకోవ‌డానికి ఏమాత్రం ప్ర‌య‌త్నించరు. ‘మీరు ఆల్కాహాల్ తీసుకొంటారా’ అని సూటిగా ఎవ‌రినైనా అడిగితే స‌మాధానాలు చెప్ప‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. కానీ నాగ్ అలా కాదు. ‘మ‌ధ్యాహ్నం రెండు బీర్లు తాగి, బిరియానీ తిని, రెండు గంట‌లు హాయిగా ప‌డుకొన్నా’ అని చెప్పేయ‌గ‌ల‌రు. ఈరోజు అదే జ‌రిగింది. ‘రాజు గారి గ‌ది 2’ స‌క్సెస్ మీట్‌లో నాగ్ టాపిక్ సండే మెనూ వైపుకు వెళ్లింది. ”ఈ సండే చాలా సంతోషంగా గ‌డిపా. గ‌త కొన్ని రోజులుగా చైతూ పెళ్లి హ‌డావుడిలో ఉన్నా. ఈ రోజు రిలాక్డ్స్ గా గ‌డిపా. మ‌ధ్యాహ్నం చికెన్ బిరియానీ తిన్నా. అంత‌కు ముందే రెండు బీర్లు తాగా. రెండు గంట‌లు హాయిగా ప‌డుకొన్నా” అంటూ సండే మెను మొత్తం చెప్పేశారు. నాగ్ నోటి నుంచి బీర్లు, బిరియానీ మేట‌ర్ ఎప్పుడైతే వ‌చ్చిందో.. అక్క‌డివాళ్లంతా ఘొల్లు మ‌న్నారు. కోడ‌లు పిల్ల స‌మంత‌తో స‌హా.

రాజుగారి గ‌ది 2లో కామెడీ సీన్లు క‌ట్ చేశార‌ని తెలుగు 360 ముందే హింట్ ఇచ్చింది. దాన్ని నాగ్‌కూడా ఒప్పుకొన్నారు. ”క‌థ సీరియెస్‌గా సాగుతన్న‌ప్పుడు కామెడీ అడ్డుప‌డుతోంద‌నిపించింది. ఇదే విష‌యాన్ని ఓంకార్‌తో చెప్పా. త‌న‌కీ అదే అనిపించింది. మాకే కాదు.. అబ్బూరి ర‌వికీ, పీవీపీకీ ఇదే అనిపించింది. అందుకే కామెడీ బిట్లు క‌ట్ చేశాం” అన్నారు నాగ్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

‘రత్నం’ రివ్యూ: అంతా ర‌క్త‌సిక్తం

Rathnam Movie Telugu Review తెలుగు360 రేటింగ్ : 2/5 -అన్వ‌ర్‌ విశాల్ కు పేరు తీసుకొచ్చినవి యాక్షన్ సినిమాలే. యాక్షన్ సినిమాలకు పెట్టింది పేరు... దర్శకుడు హరి. ఈ ఇద్దరూ కలసి ఇప్పటికే రెండు సినిమాలు...

జగన్ తండ్రిని కూడా వదల్లేదా..? షర్మిల సంచలన వ్యాఖ్యలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల అసలు రాజకీయం ఇప్పుడు స్టార్ట్ చేశారు.వైఎస్సార్ కు వారసురాలు జగన్ రెడ్డి కాదని బలంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైఎస్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నది తను...

HOT NEWS

css.php
[X] Close
[X] Close