మోడీ ప్యాకేజీలో మనకేం వచ్చింది..?

ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఆత్మనిర్భర ప్యాకేజీ గురించి.. రాత్రి ఎనిమిది గంటలకు.. జాతినుద్దేశించి ప్రసంగిస్తూ చెప్పిన తర్వాత చాలా మంది మాకేమి వస్తుంది అనే లెక్కలేసుకున్నారు. అందుకే.. ప్యాకేజీ విధివిధానాల కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. సీరియల్‌గా ఐదు రోజుల మారధాన్ ప్రకటనల తర్వాత… అందరూ తెల్లమొహం వేయాల్సి వచ్చింది. ఎందుకంటే..
రెండు ఎకరాల చిన్న రైతు.. పది ఎకరాల మధ్యస్థాయి రైతు అయినా.. మోతుబరికి అయినా.. ఇప్పుడు మోడీ ప్యాకేజీలో ఎమొచ్చింది..?
ఉపాధి కోల్పోయిన చిరు వ్యాపారలకు ఏమి వచ్చిది..?
కరోనా కారణంగా ఉద్యోగం కోల్పోయిన వారికి ఏమి వచ్చింది..?
రోజు కూలీలకు ఏమి వచ్చింది..?
ఇలా విడదీసి చూసుకుంటే.. … తమకేమీ వచ్చిందో.. ఎవరికీ అర్థం కాలేదు మరి. ” జంట కవులు”గా మీడియా ముందుకు ఐదు రోజుల పాటు వచ్చి ప్యాకేజీ కచ్చేరీ చేసిన నిర్మలా సీతారామన్, ఆమె డిప్యూటీ అనురాగ్ ఠాకూర్.. సూటిగా, సుత్తిలేకుండా.. సాయం కోసం ఎదురు చూస్తున్న వారికి తామేం చేస్తున్నామో చెప్పలేకపోయారు.

సూటిగా సుత్తి లేకుండా ప్యాకేజీలు ఇచ్చిన అమెరికా సహా ఇతర దేశాలు..!

అమెరికా సహా ఇతర దేశాలిచ్చిన ప్యాకేజీలు చూసి..మోడీ కూడా ఆ తరహా ప్యాకేజీ ఇస్తారని.. భారతీయులు, పరిశ్రమలు ఆశ పడి ఉంటారు. ఎందుకంటే.. అమెరికా సహా.. జపాన్, బ్రిటన్, కెనడా వంటి దేశాలు.. నేరుగా ప్రజలు, పరిశ్రమలకు నగదు సాయం చేశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మన రూపాయల్లో 200 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీని ప్రకటించడమే కాదు. నెలలో ఆ మొత్తాన్ని నగదు రూపంలో పంపిణీ చేసేశారు కూడా. ఇలా అమెరికాలో ఉన్న 33 కోట్ల మందిలో ప్రతి ఒక్కరికి నగదు ప్రయోజనం అందింది. అవి సూటిగా ఉన్నాయి.
1. ఉద్యోగం కోల్పోయిన వారందరికీ.. మార్చి నుంచి జూలై వరకూ.. నెలకు నాలుగు వేల డాలర్లు ఇస్తున్నారు.
2. జాబ్ ఉన్నా లేకపోయినా.. ప్రతి అమెరికన్ కుటుంబానికి 3400 డాలర్లు దాకా అకౌంట్‌లో వేశారు..
3. ఐదు వందల మంది కన్నా తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలకు … రెండున్నర నెలల జీతాల ఖర్చును.. మళ్లీ చెల్లించాల్సిన అవసరం లేని రుణం కింద ఇచ్చారు. అయితే.. ఇలా ఇచ్చే సాయంలో మాత్రం కొన్ని పరిమితులు పెట్టారు.
4. పెద్ద కార్పొరేట్ కంపెనీలకు బిలియన్ డాలర్ల సాయంతో బెయిలవుట్ ప్యాకేజీలు ప్రకటించారు.
మొత్తంగా మూడు ట్రిలియన్ డాలర్లను ఇలా ప్రకటించిన ట్రంప్.. అలా బదిలీ చేసేయడం కూడా అయిపోయింది.

ప్యాకేజీ అంటే లాక్‌డౌన్ వల్ల నష్టపోయిన వాళ్లకు సాయం కాదన్న మాట..!

లాక్‌డౌన్ వల్ల.. దేశంలో ప్రతి ఒక్కరూ నష్టపోయారు. ఒక్కో విపత్తు వచ్చినప్పుడు.. ఒక్కో ప్రాంతాల వారో… ఒక్కో వ్యాపార విభాగం వారో.. నష్టపోతూ ఉంటారు. కరోనా మాత్రం.. అలాంటిది కాదు. వాళ్లు వీళ్లు అనే తేడా చూపించలేదు. అందర్నీ నష్టపరిచింది. రోజు కూలీని ఎంత దెబ్బకొట్టిందో.. కార్పొరేట్ దిగ్గజాల్ని అంతే దెబ్బకొట్టింది. ఎవరి స్థాయిలో వారు నష్టపోయారు. ఈ నష్టాల్ని పరిమితం చేయాల్సిన ప్రభుత్వాలు… సరైన వ్యూహం అవలంభించలేదు. సరే.. జరిగిందేదో జరిగిపోయింది.. ప్రభుత్వం ఎంతో కొంత సాయం చేస్తే.. నిలదొక్కుకుంటామని ఆశపడ్డారు. ప్రపంచంలోని ఇతర దేశాలన్నీ.. తమ పౌరులకు.. సంస్థలకు ప్యాకేజీలు ప్రకటించి నిలబెడుతున్న వార్తలు రోజూ పేపర్లలో కనిపిస్తూంటే.. తమకూ అలాంటి ప్యాకేజీ వస్తుందని ఆశపడ్డారు. వారి ఆశ.. నిరాశ కాకుండా.. మోడీ ఆత్మనిర్భర భారత్ అభియాన్ కింద రూ. 20 లక్షల కోట్లను ప్రకటించారు. తమకు నేరుగా నగదు సాయం అందుతుందని.. చాలా మంది రిలీఫ్ ఫీలయ్యారు. కానీ ఆ ప్యాకేజీ ప్రకటించేనాటికే ఇచ్చేశారని ఐదు రోజుల మారథాన్ ప్రకటనల తర్వాత .. ఆర్థిక మంత్రుల వారి ప్రకటనలతో తేలిపోయింది.

ఉచిత రేషన్‌తో సహా మొత్తం ప్యాకేజీ లెక్క రూ.21 లక్షల కోట్లు..!

మొత్తంగా ఐదు రోజుల పాటు నిర్మలా సీతారామన్ ప్రకటించిన ప్యాకేజీలతో కలిపి.. ఆత్మ నిర్భర అభియాన్ లో బాగంగా ప్యాకేజీ విలువ మొత్తం రూ. 20,97,053 కోట్ల ప్యాకేజీ ప్రకటించారు. మొదటి రోజు ఎంఎస్ఎంఈలతో పాటు ఇతర రంగాలకు.. రూ. 5,94,550 కోట్లు, రెండో రోజు రూ. 3,10,000 కోట్లు, మూడో రోజు రూ. 1,50,000 కోట్లు, నాలుగో రోజు.. రూ. 48,100 కోట్లను ప్రకటించారు. మొత్తంగా రూ. 11 లక్షల 2650 కోట్లు అయ్యాయి. అంతకు ముందు ప్రధాని మోదీ గరీబ్ కళ్యాణ్ యోజన ద్వారా రూ 1,92,000 కోట్లు కేటాయించారు. ఆర్బీఐ రూ. 8,01,603 కోట్ల ప్యాకేజీని ప్రకటించింది. మొత్తం కలిపితే దాదాపుగా ఇరవై ఒక్క లక్షల కోట్లు అయ్యాయని ప్రభుత్వం లెక్క చెప్పింది. ఆర్బీఐ.. ఈఎంఐలు మూడు నెలల వాయిదాకు అవకాశం ఇచ్చింది. వడ్డీ మీద వడ్డీ బాదాలని బ్యాంకులకు చాన్సిచ్చింది. అది ప్యాకేజీలో భాగంగా లబ్ది పొందడం ఎలా అవుతుందో.. కేంద్రానికే తెలియాలి.

బడ్జెట్ ప్రతిపాదనలన్నీ ప్యాకేజీలో భాగం అయిపోయాయేంటి..?

ఆర్థిక మంత్రి ప్రకటనల్లో సూటిగా సుత్తిలేకుండా చెప్పింది ఒకే ఒక్కటి. అదే ప్రైవేటీకరణ. ఇప్పటికి ప్రభుత్వం హోల్డ్‌లో ఉన్న అన్ని రంగాల్లోనూ ఇక ప్రైవేటీకరణ ఖాయమని ప్రకటించారు. మొత్తం నాలుగంటే నాలుగు సంస్థలు మాత్రమే మిగిల్చి.. ఏక మొత్తంగా ప్రభుత్వ సంస్థలన్నింటినీ అమ్మేస్తామని ప్రకటించారు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో అంచనా వేయడం కష్టం. అదే సమయంలో పరిశ్రమలకు.. పారిశ్రామిక వర్గాలకు అప్పుల అవకాశం ఇచ్చారు. అప్పులు ఇవ్వడం ప్యాకేజీలో.. సాయం చేయడంలో ఎలా భాగం అవుతుందో .. దాన్ని రూపాయల్లో కొలవడం ఏమిటో అర్థం కాని విషయం. ప్రభుత్వ విధానాలు.. చేయాలనుకున్న పనులు.. అన్నీ ప్యాకేజీల్లో భాగంగా కలిపేసి.. ఆత్మ నిర్భర ప్యాకేజీగా ప్రకటించేసుకున్నారు. చివరికి ప్రజలు ఊసూరుమనడం తప్ప ఏమీ చేయలేకపోయారు. కనీసం.. ఉపాధి కోల్పోయిన వారి కోసం … ఏదైనా కొంత నేరుగా నగదు సాయం చేసి ఉంటే.. ఎక్కువ మంది సంతోషపడేవాళ్లు. కానీ.. !

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close