చైతన్య : మద్య నియంత్రణ కాదు మందుబాబుల దోపిడి..!

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం విధానంతో… పరిస్థితి ఇదే. మద్య నిషేధం దిశగా వెళ్తున్నామని చెబుతున్న ప్రభుత్వం… ఆ పేరుతో మద్యానికి అలవాటు పడిన వారిని పిండేయడానికి ఏర్పాట్లు చేసింది. వారి దగ్గర్నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా లాగేయబోతోంది. అంతే కాదు.. నాలుగైదు బ్రాండ్లలోనే వారు తమ చాయిస్ వెదుక్కోవాల్సి ఉంటుంది. ప్రభుత్వానికి, నాలుగైదు మద్యం కంపెనీలకు కొత్త విధానం ద్వారా కిక్ వస్తూంటే… మందుబాబులకు మాత్రం.. ప్రభుత్వం నిజంగా కిక్కింగ్ చేసిన ఫీలింగ్ కలుగుతోంది

“టాక్స్ పేయర్ల”ను పిండేసి పండగ చేసుకుంటున్న ప్రభుత్వం..!

ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఏదీ ప్రజల ఇష్టం కాదు . అంతా ప్రభుత్వం దయే. ప్రభుత్వం ప్రారంభించిన మద్యం దుకాణాల్లో ఇప్పుడు నాలుగైదు రకాల బ్రాండ్లే అమ్ముతున్నారు. వాటినే ఎందుకు అమ్ముతున్నారు.. మిగతా వాటిని ఎందుకు అమ్మడం లేదనే విషయం .. ఎవరూ అడగకూడదు. అడిగినా చెప్పరు. మందుబాబులు… గతంలో ఏ బ్రాండ్‌కు అలవాటుకు పడినా.. ఇప్పుడు ఏపీ సర్కార్ ఇష్టంగా అమ్ముతున్న నాలుగు బ్రాండ్లలో దేనికో ఓ దానికి ఫిక్సవ్వాలి. అయితే.. దీని వెనుక ఓ స్కాం ఉందని.. టీడీపీ నేతలు అంటున్నారు. సరే.. తప్పదు కదా.. అని.. ప్రభుత్వం తన మద్యం దుకాణాల్లో అమ్ముతున్న నాలుగైదు బ్రాండ్లలో ఏదో ఒకటి సెలక్ట్ చేసుకుంటే.. పని పూర్తయిపోదు. వారు చెప్పినంత ధర ఇవ్వాలి.

మందుబాబుల జేబులు గుల్ల..! అస్మదీయ మద్యం కంపెనీలకు వేల కోట్లు..!

ప్రభుత్వం ఇరవై శాతం షాపులు తగ్గించామని చెబుతోంది. ఇలా తగ్గిస్తే ప్రభుత్వానికి ఆదాయం పడిపోవాలి. కానీ.. రెట్టింపు అవుతోంది. మందుబాబుల నుంచి ఈ ఏడాది ఆరు వేల కోట్ల రూపాయలు అదనంగా పిండేలా రేట్లు పెంచారు. మరో వైపు పరిమితమైన బ్రాండ్లనే అందుబాటులో ఉంచారు. దీని వల్ల ఆయా కంపెనీల బిజినెస్ వందల కోట్లు పెరుగుతుంది. ఆ కంపెనీల విలువ వేల కోట్లు పెరుగుతుంది. ఈ కంపెనీ యజమానులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పుణ్యమా అని… అపరకుబేరులైపోతారు. కానీ.. మద్యానికి అలవాటు పడినవారు మాత్రం మొత్తానికే నిరుపేదలైపోతారు. ఈ మొత్తం సైకిల్‌ను చూస్తే.. రాజకీయ నాయకుల తెలివి తేటల గురించి సినిమాల్లో చూపించే.. కుట్ర కోణాలు సులువుగానే అందరికీ గుర్తుకు వస్తూ ఉంటాయి. మరి నిజంగానే అలాంటివేమైనా ఉన్నాయా లేవా అన్నదానిపై భిన్నాభిప్రాయాలున్నాయి. టీడీపీ నేతలు మాత్రం.. ఇదో స్కాం అని ఆరోపణలు ఇప్పటికే ప్రారంభించారు.

వైసీపీ నేతలకు అక్రమ మద్యం మరో ఇసుకలా మారుతుందా..?

అయితే ఏపీ సర్కార్ మాత్రం 151 ఎమ్మెల్యే సీట్లు వచ్చినందున.. తాము ఎవరి మాటలను వినాల్సిన అవసరం లేదని.. తాము చెప్పిందే శాసనమన్నట్లుగా ఉంది. మద్యం విధానం విషయంలో ఎలాంటి మేధోమథనం జరగలేదు. ఒక్క సారిగా మద్యం అమ్మకాలను ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటే వచ్చే పరిణామాల గురించి ఆలోచించలేదు. ఇసుక తరహాలో.. అసలు కన్నా బ్లాక్‌లోనే మద్యం ఎక్కువ దొరికితే.. మొత్తానికే మోసం వస్తుందన్న సంగతిని అంచనా వేయలేదు. అధికార పార్టీ నేతల ఇసుక దందా .. లిక్కర్‌లోకి వస్తే.. జరిగేది అరాచకమే. పోలీసులు ఎంత స్వేచ్చగా పని చేయగలగుతున్నారో.. అందరూ చూస్తూనే ఉన్నారని.. విపక్ష నేతలు ఇప్పటికే సీరియస్‌గా విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటిపై.. ప్రభుత్వం ప్రకటనల్లో మాత్రం.. గొప్పగా చెబుతోంది. వాస్తవంగా జరుగుతోంది మాత్రం వేరనే విమర్శలు వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో కిక్సన్నీ.. మందుబాబులకు.. వారి కుటుంబాలకు.. అసలు కిక్ బ్యాక్స్ అన్నీ.. ప్రభుత్వ పెద్దలకు అని.. ప్రతిపక్షం ఆరోపిస్తోంది. ఈ లెక్కలన్నీ… తేలాలంటే.. కొద్ది రోజులు ఆగాల్సిందేనని.. ఎక్సైజ్ రంగంలో నిపుణులంటున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close