కొత్త టర్న్‌ తీసుకున్న బాలకృష్ణ 100వ సినిమా.!

నందమూరి బాలకృష్ణ 99వ సినిమా ‘డిక్టేటర్‌’ సంక్రాంతికి రిలీజ్‌ అయి అతని కెరీర్‌లోనే ఓ డిఫరెంట్‌ మూవీగా పేరు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇక బాలకృష్ణ చెయ్యబోయే 100వ సినిమాపైనే అందరి దృష్టీ పడింది. తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్ఠాత్మక చిత్రంగా వుండాలని బాలకృష్ణ భావిస్తున్న విషయం తెలిసిందే. సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ‘ఆదిత్య 369’ చిత్రానికి సీక్వెల్‌గా ‘ఆదిత్య 999’ చిత్రాన్ని రూపొందనుందని ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ చిత్రం ద్వారా మోక్షజ్ఞను పరిచయం చెయ్యబోతున్నానని కూడా బాలకృష్ణ చెప్పాడు. ఈ చిత్రానికి సింగీతం దర్శకుడు కాదని, బాలకృష్ణ తనే డైరెక్ట్‌ చెయ్యబోతున్నాడన్న వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఇవేవీ కరెక్ట్‌ కాదని లేటెస్ట్‌గా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. గత సంవత్సరం ఆరంభంలో నందమూరి కళ్యాణ్‌రామ్‌తో ‘పటాస్‌’ వంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ని రూపొందించిన అనిల్‌ రావిపూడి ఇప్పుడు తెరపైకి వచ్చాడు. బాలయ్య 100వ సినిమాని అనిల డైరెక్ట్‌ చెయ్యబోతున్నాడట. అనిల్‌ ఒక కొత్త కాన్సెప్ట్‌ బాలకృష్ణకి వినిపించడం, అది బాలయ్యకు నచ్చడంతో 100వ సినిమా చేసే అవకాశం అనిల్‌కే ఇచ్చే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ చిత్రానికి ‘రామారావుగారు’ అనే టైటిల్‌ కూడా పరిశీలనలో వుందట. ఈ చిత్రాన్ని దిల్‌రాజు చాలా భారీ బడ్జెట్‌తో నిర్మించేందుకు రెడీ అవుతున్నాడని సమాచారం. అయితే ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రావాల్సి వుంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

బిగ్ బ్రేకింగ్ – షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం

షాద్ నగర్ లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నందిగామ శివార్ సమీపంలోని అలెన్ హోమియో , హెర్బల్ కంపెనీలో ఈ అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి....

HOT NEWS

css.php
[X] Close
[X] Close