ఎన్నికలు నిర్వహిస్తున్నామని నిమ్మగడ్డ ఎక్కడా చెప్పలేదుగా..!?

ఎన్నికల విషయంలో అన్ని పరిశీలించే నిర్ణయం తీసుకుంటామని.. ఎన్నికలు నిర్వహిస్తామని తాము ఎక్కడా చెప్పలేదని.. కేవలం హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించడానికే అన్ని పార్టీలు, ప్రభుత్వం నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నానని నిమ్మగడ్డ చెబుతున్నారు. ప్రభుత్వం అభిప్రాయం చెప్పడానికి తనతో సమావేశం అయిన ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ నీలం సహానికి అయన అదే విషయం స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో.. నిమ్మగడ్డ ఎన్నికలు పెట్టబోతున్నారని… దాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ప్రకటనలు చేస్తూ వస్తున్న వైసీపీ నేతలల్లో .. తాము తొందరపడ్డామా అన్న భావన ఏర్పడుతోంది. కొద్ది రోజులుగా నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై వైసీపీ నేతలు మళ్లీ విమర్శలు చేస్తున్నారు. ఆయన ఎన్నికలు పెట్టబోతున్నారని.. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఎన్నికలు ఎలా పెడతారని ప్రశ్నిస్తున్నారు.

నిజానికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానిక ఎన్నికలు పెట్టబోతున్నట్లుగా ఎక్కడా చెప్పలేదు. తనంతట తాను ఆయన సంప్రదింపుల ప్రక్రియ కూడా ప్రారంభించలేదు. హైకోర్టులో దాఖలైన ఓ పిటిషన్ విషయంలో.., ఏపీ సర్కార్.. కరోనా వల్ల ఇప్పుడే స్థానిక ఎన్నికలు నిర్వహించలేమని అఫిడవిట్ వేసింది. అయితే..అలా చెప్పడానికి ప్రభుత్వానికేం అధికారం ఉందని… తన అభిప్రాయాన్ని ఎస్‌ఈసీకే తెలియచేయాలని సూచించింది. ఎస్‌ఈసీకి నోటీసులు జారీ చేసింది. ఈ నోటీసుల కారణంగా ఎస్‌ఈసీ అన్ని పార్టీల అభిప్రాయాలను.. ప్రభుత్వ అభిప్రాయాలను తెలుసుకుని .., హైకోర్టుకు నివేదించాలని నిర్ణయించారు. ఈ మేరకు ప్రస్తుతం సంప్రదింపులు జరుపుతున్నారు.

ఎన్నికల కమిషన్‌కు రావాల్సిన నిధుల విషయంలో నిమ్మగడ్డ పిటిషన్ వేశారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిధుల్ని నిలిపివేసినట్లుగా ఆయన చెబుతూ.. కోర్టును ఆశ్రయించారు. ఆ సమయంలో.. ఎన్నికల నిర్వహణకు కూడా సహకరించడం లేదని.. చెప్పారు. ఆ విషయంతో వైసీపీ నేతల్లో.. ఆయన ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నట్లుగా ఊహించుకుని విమర్శల వర్షం కురిపిస్తున్నారు. హైకోర్టు తీర్పు ప్రకారం… నిమ్మగడ్డ ఎన్నికల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఈ లోపు నిమ్మగడ్డపై విమర్శలు చేస్తూ.. వైసీపీ నేతలు.. రాజకీయ వ్యూహం అమలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close