రాజకీయ పార్టీలకు సినీ గ్లామర్ లేనట్లే..!

సార్వత్రిక ఎన్నికల్లో ప్రచారానికి కానీ.. పోటీకి కానీ.. సినీ నటులు… పెద్దగా ప్రయత్నించడం లేదు. తెలుగుదేశం పార్టీలో ఎన్టీఆర్ కుటుంబం ఉంది. బాలకృష్ణ ఎమ్మెల్యేగా రంగంలోకి దిగుతున్నారు. పలు నియోజకవర్గాల్లో ప్రచారం కూడా చేస్తున్నారు. ఇక తారకరత్న లాంటి ఇతర కుటుంబసభ్యులు.. ఎన్నికల ప్రచారంలో యాక్టివ్‌గా పాల్గొంటారు. సీనియర్ హీరోయిన్ దివ్యవాణి.. ఇటీవల టీడీపీలో చేరి… అధికార ప్రతినిధిగా.. తన వాయిస్ వినిపిస్తున్నారు. అంతే తప్ప… పెద్దగా సినీ గ్లామర్ టీడీపీకి లేదు. పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టడంతో… జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ కూడా ప్రచార బరిలోకి దిగడం లేదు. అలాగే.. సెలబ్రిటీ కుటుంబాలతో.. బంధుత్వాలు ఉన్న పలువురు టీడీపీ తరపున పోటీ చేస్తున్నారు. అయినప్పటికీ.. ఓ పార్టీకి మద్దతు ప్రకటించి తమపై రాజకీయ ముద్ర పడేలాచేసుకోవడానికి సిద్ధంగా లేరు. గుంటూరు ఎంపీ స్థానానికి పోటీ పడుతున్న గల్లా జయదేవ్‌కు .. సూపర్ స్టార్ మహేష్ బాబు దగ్గరి బంధువు. అయితే.. వ్యక్తిగతంగా.. జయదేవ్‌కు మద్దతు ప్రకటిస్తున్నారు కానీ.. పార్టీ పరంగా.. ఆయన మద్దతు ప్రకటించడం లేదు. తెలుగుదేశం పార్టీ కూడా.. ఈ విషయం వారిపై ఎలాంటి ఒత్తిడి చేయడం లేదు.

ఇప్పటికీ టాలీవుడ్‌లోని సెలబ్రిటీలు చాలా మంది.. టీడీపీతోనే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు. మురళీమోహన్ నిన్నామొన్నటి వరకు ఎంపీగా ఉన్నారు. అలాగే.. పలువురు ప్రముఖులు.. నిత్యం టీడీపీ హైకమాండ్‌తో టచ్‌లోఉంటారు. అందుకే .. టాలీవుడ్‌లో తెర వెనుక తెలుగుదేశం పార్టీ కోసం పని చేసే వారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. సినీ నటుల మద్దతు కోసం.. చాలా తీవ్రంగా ప్రయత్నించింది. నాగార్జున మద్దతు కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లుగానే.. ఇతర హీరోలపైనా కాస్తంత ఒత్తిడి తెచ్చిందని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఘట్టమనేని ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరక ముందు.. కృష్ణతో పదే పదే ఇంటర్యూలు ప్రసారం చేసేవారు. ఇప్పుడు…ఆదిశేషగిరిరావు టీడీపీలో చేరారు. దాంతో ఆ లింక్ కూడా కట్ అయింది. కానీ.. టాలీవుడ్‌లో కొంత మంది ప్రత్యేకమైన వ్యక్తుల మద్దతు వైసీపీకి చాలా గట్టిగా లభిస్తోంది. పోసాని కృష్ణమురళి, ధర్టీ ఇయర్స్ ఫృధ్వీలకు తోడు..తాజాగా అలీ కూడా ఆ పార్టీలో చేరారు. పోసాని కృష్ణమురళి.. ఇటీవలసైలెంట్ గా ఉంటున్నప్పటికీ.. ధర్టీ ఇయర్స్ ఫృధ్వీ హడావుడి చేస్తున్నారు. ఎన్నికల్లో అలీతో కలిసి జోరుగా ప్రచారం చేసే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీలో ఉన్న జయసుధ ఇప్పటికే వైసీపీలోచేరారు. ప్రచారం కూడా చేస్తామన్నారు కాబట్టి.. ఆమె సేవల్ని కూడా .. వైసీపీ ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. ఇతర హీరోలు.. పెద్దగా వైసీపీకి కూడా ప్రచారం చేసే అవకాశం లేదు. మోహన్ బాబు కుటుంబంతో ఉన్న బంధుత్వం కారణంగా.. ఆ కుటుంబానికి చెందిన ఇద్దరు హీరోలు మంచు విష్ణు, మనోజ్ తో ప్రచారం చేయించుకోవాలని..వైసీపీ ప్రయత్నాలుచేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అంగీకరిస్తారా లేదా అన్నది ఆసక్తికరం

జనసేన తరపున ప్రచారం చేయడానికి మెగా హీరోలు వస్తారా లేదా అన్నది కీలకంగా మారింది. సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల్లో సగం మంది మెగా క్యాంప్‌నకు చెందిన వారే.వారందరూ సపోర్ట్ చేస్తే.. జనసేనకు గ్లామర్ వచ్చేసినట్లే. అంతే కాదు పవన్ అంటే.. ప్రాణం ఇచ్చేంత అభిమానం అని చెప్పుకునే నిఖిల్‌, నితిన్ లాంటి… యువ హీరోలు కూడా.. ఆయన ఒక్క పిలుపు ఇస్తే.. ప్రభంజనంలా తరలి వస్తామని చెబుతూంటారు. అయితే… పవన్ కల్యాణ్…వారిని తన పార్టీ కోసం ప్రచారం చేయమని అడుగుతారా లేదా..అన్నది జనసేన వర్గాలకు పజిల్‌గా మారింది. ప్రత్యక్ష రాజకీయాల నుంచి దాదాపుగా విరమించుకున్న చిరంజీవి.. ఎలాంటి పరిస్థితుల్లోనూ… తమ్ముడు పవన్ కల్యాణ్ పార్టీకి ప్రచారం చేసే అవకాశం లేదంటున్నారు. పవన్ పిలుపునివ్వాలి కానీ.. ప్రచార బరిలోకి దిగడానికి తాము రెడీ అని రాంచరణ్, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, ధరమ్ తేజ్ లాంటి బంధువులు ఇప్పటికే ప్రకటనలు చేశారు. అయితే.. ఇప్పుడు పజిల్.. పవన్ కల్యాణ్ వారిని ప్రచారానికి పిలుస్తారా లేదా.. అనేదే… ! ఆయన సన్నిహితులు మాత్రం.. తనపై హీరోలు చూపించే అభిమానాన్ని.. ఆయన… రాజకీయానికి వాడుకోరని… చెబుతున్నారు. దానికి అలీనే సాక్ష్యం అంటున్నారు. పవన్ ఒత్తిడి చేస్తే.. కచ్చితంగా అలీ జనసేనలో చేరి ఉండేవారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

సూప‌ర్ స్టార్ బ‌ర్త్‌డేని టార్గెట్ చేసిన సుధీర్ బాబు

మే 31... సూప‌ర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా మ‌హేష్ బాబు - రాజ‌మౌళి కాంబోలో రాబోయే సినిమాకు సంబంధించిన అప్ డేట్ ఏమైనా వ‌స్తుందా? అని మ‌హేష్...

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

HOT NEWS

css.php
[X] Close
[X] Close