గిరిజన వర్శిటీ పేరుతో కేంద్రం గిమ్మిక్కులు చేస్తోందా..?

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన వర్సిటీ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు బ్రేకింగ్‌న్యూస్లు హడావుడి చేశాయి. విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయనున్న వర్శిటీకి రూ.834 కోట్లు ఇస్తారని కూడా చెప్పుకొచ్చారు. నిజానికి ఇదో పెద్ద ఫార్స్ అన్న విషయం.. గిరిజన వర్శిటీ విషయంలో కేంద్రం ఇప్పటి వరకూ తీసుకున్న చర్యలను చూస్తే అర్థమవైపోతుంది. ఎందుకంటే.. బడ్జెట్‌లోఈ యూనివర్శిటీ కోసం కేటాయించింది.. రూ. 10 కోట్లు మాత్రమే. అసలు… గిరిజన వర్శిటీ ఏర్పాటు చేయాలంటే.. పార్లమెంట్‌లో చట్టం చేయాలని. కానీ నాలుగున్నరేళ్లపాటు.. కేంద్రం దీన్ని పట్టించుకోలేదు.

ఆంధ్రప్రదేశ్‌రాష్ట్ర పునర్విభజన చట్టం 2014, సెక్షన్ 93, షెడ్యూల్ 13 (3)లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో గిరిజన యూనివర్సిటీలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు వరంగల్‌, విజయనగరం జిల్లాలలో స్థలసేకరణ కూడా చేశాయి. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు పార్లమెంటులో ప్రత్యేకంగా చట్టం చేయాలి. కాని నేటికీ కేంద్ర ప్రభుత్వం ఆ పని చేయలేదు. రెండవది కేంద్ర ప్రభుత్వం సరిపడా నిధులు కేటాయించాలి. గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు 1100 కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయని కేంద్ర నిపుణుల బృందం తెలిపింది. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ నాలుగు సంవత్సరాల కాలంలో అదీ ఈ సంవత్సరం బడ్జెట్‌లో మాత్రమే రూ.10 కోట్లు కేటాయించింది. అయితే ఆ నిధులను కూడా విడుదల చేయలేదు. చట్టం చేస్తేనే.. నిధులు విడుదల అవుతాయి.

కానీ కేంద్రం ఇంత వరకూ.. సింపుల్‌గా అయిపోయే చట్ట సవరణ మాత్రం చేయడం లేదు. బడ్జెట్ లో పది కోట్లు కేటాయించి.. ఏకంగా కేబినెట్ భేటీలో మాత్రం.. రూ. 834 కోట్లు ఇస్తున్నట్లు చెప్పుకోవడం.. పబ్లిసిటీ కోసం తప్ప..మరో దాని కోసం… కాదని.. వివిద పార్టీల నేతలు మండి పడుతున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close