తెలుగువాళ్ల‌కు మ‌ళ్లీ హ్యాండిచ్చిన రాజ‌మౌళి

తెలుగు సినిమాగా మొద‌లైన బాహుబ‌లి.. ఆ త‌ర‌వాత ఇంటర్నేష‌న‌ల్ ఫిల్మ్ గా మారిపోయింది. మ‌రీ ముఖ్యంగా బాలీవుడ్ జ‌నాలు.. బాహుబ‌లి అంటే చెవి కోసేసుకొంటున్నారు. ఆ క్రేజ్‌ని రాజ‌మౌళి అండ్ టీమ్ కూడా మా బాగా వాడుకొంటోంది. తెలుగులో ప్ర‌మోష‌న్లు చేసుకొన్నా, లేకున్నా.. వ‌చ్చిన మైలేజీ ఎలాగూ వ‌చ్చేసింది. ‘మా సినిమా చూడొద్దు’ అన్నా స‌రే, ఎగ‌బ‌డి చూస్తార‌న్న ధీమా రోజు రోజుకీ పెరిగిపోతోంది. అందుకే తెలుగు మీడియాని ముందు నుంచీ చిన్న చూపు చూస్తూనే ఉంది బాహుబ‌లి టీమ్. ముంబైలో ప్ర‌మోష‌న్ల కోసం భారీ ఎత్తున టైమ్ కేటాయించిన రాజ‌మౌళి అండ్ టీమ్‌.. తెలుగు నాట మాత్రం నిర్ల‌క్ష్యం ప్ర‌ద‌ర్శిస్తోంది. ఇప్పుడు ప్రీమియ‌ర్ షోలూ అక్క‌డేన‌ట‌.

ఈనెల 28న బాహుబ‌లి 2 విడుద‌ల కాబోతోంది. అందుకు ఒక్క‌రోజు ముందు అంటే… 27న ముంబైలో బాహుబ‌లి హిందీ వెర్ష‌న్‌ని ప్ర‌ద‌ర్శిస్తారు. ఈ స్పెష‌ల్ షోకి బాహుబ‌లి 2 టీమ్‌తో పాటు, బాలీవుడ్ దిగ్గ‌జాలు హాజ‌ర‌వుతార‌ని స‌మాచారం. అంటే.. 27న తెలుగులో ప్రీమియ‌ర్ షోల హంగామా లేన‌ట్టే. బాహుబ‌లి 1 స‌మ‌యంలోనూ ఇంతే. ముంబైలో ప్ర‌త్యేక షో వేసి, అక్క‌డ ప‌బ్లిసిటీకి వాడుకొన్నారు. ఇప్పుడూ.. తెలుగు మీడియాకు, ఇక్క‌డ సినీ ప్ర‌ముఖుల‌కు హ్యాండిచ్చేయ‌డానికి రెడీ అయిపోయాడు రాజ‌మౌళి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close