ఎన్టీఆర్ జేమ్స్ బాండ్‌గా మారిన వేళ‌

ఇప్పుడు హీరోలంతా బుల్లితెరపై ఫోకస్ చేశారు. నాగార్జున, చిరంజీవి.. ఇలా స్టారలంతా హోస్ట్ లుగా మారిపోయారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ఈ వరుసలో చేరాడు. ‘బిగ్‌ బాస్‌’ .. ఈ రియాల్టీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకున్న షో ఇది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా హయ్యెస్ట్ టీఆర్పీ రాబడుతున్న రియాలిటి షో . ఇప్పుడు ఈ షో ను తెలుగులో చూపించాబోతున్నారు. తెలుగు బిగ్ బాస్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఇటివలే ఈ షో కు సంబధించి ఆయన ఫస్ట్ లుక్ కూడా వదిలారు. ఎన్టీఆర్ ఎంట్రీ అదిరిపోయింది. జేమ్స్ బాండ్ టైపులో.. స్టైలీష్‌గా క‌నిపించాడు. మున్ముందు ఎన్టీఆర్ మ‌రింత కేక పెట్టించ‌డం ఖాయ‌మ‌నేలా టీజ‌ర్ వ‌దిలారు.

ఇప్పుడీ షో కు సంబధించిన ప్రొడక్షన్ పనులు శరవేగంగా సాగుతున్నాయి. ప్రస్తుతం తెలుగు షోకి సంబధించిన టైటిల్ సాంగ్ ను రూపొందిస్తున్నారు. ఈ భాద్యతను సంగీత దర్శకుడు థమన్‌ కి అప్పగించారు. థమన్‌ సంగీత సారథ్యంలో టైటిల్‌ సాంగ్‌ రూపొందిస్తున్నారు. ఈ విషయాన్ని తమన్‌ స్వయంగా వెల్లడించాడు.

ఇలాంటి స్పెషల్ టైటిల్ సాంగ్స్ చేయడం థమన్‌ కు కొత్తేం కాదు. ఐపియల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి టైటిల్ సాంగ్ ఇచ్చింది తమనే. అలాగే సిసియల్ టాలీవుడ్ టీం కు కూడా. ఈ రెండు బాగా జనాల్లోకి రీచ్ అయ్యాయి. ఇప్పుడు ఎన్టీఆర్ బిగ్ బాస్ టైటిల్ స్కోర్ భాద్యత కూడా థమన్‌ కే అప్పగించారు.