మహానాయకుడు విడుదల తేదీ ఖరారైంది!

ఫిబ్రవరి 22న `ఎన్టీఆర్ మహానాయకుడు` ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో మరో ఆలోచనకు తావు లేదు. ముందుగా ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 7న విడుదల చేయాలనుకున్నారు. కానీ, `కథానాయకుడు` ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని `మహానాయకుడు`లో మార్పులు చేర్పులు చేయడం మొదలెట్టారు. దాంతో విడుదల తేదీ వెనక్కి వెళ్లింది. ఫిబ్రవరి 22 అన్నారు. ఓ వరం క్రితం ఫిబ్రవరి 22 నుంచి మార్చి 1కి సినిమా వాయిదా పడిందని ఫిలింనగర్‌లో పుకార్లు షికార్లు చేశాయి. క్రిష్ పుకార్లకు స్పందించకుండా సినిమా చిత్రీకరణ పూర్తిచేసే పనిలో నిమగ్నమయ్యాడు. శనివారంతో చిత్రీకరణ ముగిసింది. ఇప్పుడు తెలివిగా బసవతారం పాత్రలో నటించిన విద్యా బాలన్ చేత విడుదల తేదీ అనౌన్స్ చేయించారు. `మహానాయకుడు` ఈ నెల 22న విడుదలవుతుందని విద్యా బాలన్ ప్రకటించింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాల్లో క్రిష్ బృందం క్షణం తీరిక లేకుండా పని చేస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

స‌మంత భ‌య‌పెట్టేస్తోంది

క‌థానాయిక‌ల పారితోషికంపై ఎప్పుడూ ఎడ‌తెగ‌ని చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. స్టార్ హోదా వ‌చ్చిన క‌థానాయిక‌లు ఎప్ప‌టి క‌ప్పుడు త‌మ రేట్ల‌ని పెంచుకొంటూ పోతుంటారు. డిమాండ్ - అండ్ స‌ప్లై సూత్రం ప్ర‌కారం నిర్మాత‌లూ...

ఎన్డీఏ కూటమికి మందకృష్ణ సపోర్ట్ !

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎన్డీఏ కూటమికి మద్దతు తెలిపింది. ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేశారు. చంద్రబాబు హయాంలో మాదిగలకు మేలు...

ప్ర‌శాంత్ వ‌ర్మ‌.. ‘లేడీస్ స్పెష‌ల్’

ముందు నుంచీ... విభిన్న‌మైన దారినే వెళ్తున్నాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. త‌ను ఎంచుకొనే ప్ర‌తీ క‌థా... తెలుగు ప్రేక్ష‌కుల‌కు ఓవ‌ కొత్త జోన‌ర్ ని ప‌రిచ‌యం చేసింది. 'హ‌నుమాన్' తో పాన్ ఇండియా క్రేజ్...

రేపే చ‌ర‌ణ్ సినిమాకు కొబ్బ‌రికాయ్‌!

ఎట్ట‌కేల‌కు రామ్ చ‌ర‌ణ్ - బుచ్చిబాబు సినిమా పట్టాలెక్క‌బోతోంది. రేపు అంటే.. బుధ‌వారం హైద‌రాబాద్ లో ఈ చిత్రాన్ని లాంఛ‌నంగా ప్రారంభించ‌నున్నారు. ఈ ముహూర్తం వేడుక‌కు చిత్ర‌బృందంతో పాటు కొంత‌మంది ప్ర‌త్యేక అతిథులు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close