‘వి’ సినిమాకి సూపర్ ఆఫ‌ర్‌

విడుద‌ల‌కు సిద్ధ‌మై, లాక్ డౌన్ వ‌ల్ల ఆగిపోయిన చిత్రాల‌పై ఓటీటీ వేదిక‌లు దృష్టి పెట్టాయి. ఫ్యాన్సీ రేట్లు ఎర‌చూపి సినిమాల్ని కొనేయాల‌ని ఫిక్స‌య్యాయి. కొన్ని చిన్న సినిమాలు ఇప్ప‌టికే ఓటీటీ గ్రిప్పులోకి వెళ్లిపోయిన‌ట్టు స‌మాచారం. `వి` సినిమాకీ మంచి ఆఫ‌ర్ దొరికింది. అమేజాన్ ఈ సినిమాకి 35 కోట్లు ఆఫ‌ర్ చేసింద‌ని తెలుస్తోంది. రూ.35 కోట్లంటే టెమ్టింగ్ ఫిగ‌రే. టేబుల్ ప్రాఫిట్టుతో సినిమా బ‌య‌ట‌ప‌డిపోతుంది. దిల్ రాజుకి లాభాలే కావాల‌నుకుంటే ఈ సినిమాని అమ్ముకోవొచ్చు. కానీ.. ఆయ‌న ముగ్గుర్ని ఒప్పించాల్సివుంది. నాని, సుధీర్‌బాబు, ఇంద్ర‌గంటి మోహ‌న కృష్ణ లు ఓటీటీ రిలీజ్‌కి ఏమంటారో అన్న సందేహం ఉంది. పైగా వి లాంటి సినిమా ఎప్పుడు వ‌చ్చినా జ‌నాలు చూస్తారులే అన్న‌ది దిల్ రాజు న‌మ్మ‌కం. ఎందుకంటే కాంబినేష‌న్ అలాంటిది. థియేట‌ర్‌లో కాకుండా నేరుగా ఓటీటీలో విడుద‌ల చేస్తే త‌మ ఇమేజ్ కి భంగం క‌లుగుతుంద‌ని కొంత‌మంది హీరోలు భ‌య‌ప‌డుతున్నారు. అందుకే వాళ్లెవ‌రూ ఓటీటీ విడుద‌ల‌కు ఓకే చెప్ప‌డం లేదు. లాక్ డౌన్ మే వ‌ర‌కూ కొన‌సాగితే మాత్రం.. అంద‌రూ ఓటీటీ వైపు దృష్టి సారించాల్సిందే. అప్పుడు ఈ ఫ్యాన్సీ రేట్లు బాగా త‌గ్గిపోయే ప్ర‌మాదం ఉంది. అందుకే… నిర్మాత‌లూ ఎటూ తేల్చుకోలేక‌పోతున్నారు. ఈనెల 14న లాక్ డౌన్ ఎత్త‌కుండా కొన‌సాగితే మాత్రం.. నిర్మాత‌లు, హీరోలూ ఓటీటీ దారిలోనే ప్ర‌యాణం చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుందేమో.?

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

కొన్ని చోట్ల స్వతంత్రులకు గాజు గ్లాస్ గుర్తు – ఈసీ ఆదేశాలపై గందరగోళం !

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎన్నికల సంఘం నిర్దిష్టమైన ఆదేశాలపై రిటర్నింగ్ అధికారులకే స్పష్టత లేకపోవడంతో ఎక్కడికక్కడ గందరగోళం ఏర్పడుతోంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగియడంతో స్వతంత్రులకు రిటర్నింగ్ అధికారులు గుర్తులు కేటాయింటారు. ఫ్రీ సింబల్స్...

పదేళ్ల తర్వాత ఓయూపై స్పందించిన కేసీఆర్

తెలంగాణ ఉద్యమ సమయంలో నిత్యం ఓయూను పలవరించిన కేసీఆర్.. గద్దెనెక్కాక ఒక్కసారి కూడా ఓయూను సందర్శించలేదు. విద్యార్థులు రోడ్డెక్కి ప్రొఫెసర్లను నియమించాలని,స్కాలర్ షిప్స్ పెంచాలని, వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్...

నోరు జారిన ర‌చ‌యిత‌.. ఫైర్ అవుతున్న ఫ్యాన్స్

తోట‌ప‌ల్లి మ‌ధు... ఈ త‌రానికి పెద్ద‌గా ఈ ర‌చ‌యిత పేరు తెలియ‌క‌పోవొచ్చు కానీ, 90ల్లో వ‌చ్చిన కొన్ని సినిమాల‌కు ఆయ‌న మాట‌లు అందించారు. కొన్ని పెద్ద హిట్లు కొట్టారు. న‌టుడిగానూ త‌న‌దైన ముద్ర...

బడా భాయ్ కి కోపమొచ్చింది… ఛోటా భాయ్ కి సమన్లు వచ్చాయి..!!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మోడీని బడా భాయి అని పిలిచినా,సరదాగా ఆహ్వానించినా రాజకీయాల్లో తమ్ముడు.. తమ్ముడే.. పేకాట.. పేకాటే అని నిరూపిస్తున్నారు బీజేపీ నేతలు. బడా భాయి అని మోడీని ఉద్దేశించి...

HOT NEWS

css.php
[X] Close
[X] Close