మ‌హేష్‌కి ఆమెతో ఒరిగేదేమిటి?

మ‌హేష్ బాబు – మురుగ‌దాస్ కాంబినేష‌న్‌లో సినిమా ఇంకా ప‌ట్టాకెక్క‌క‌ముందే సెన్సేష‌న‌ల్ అయికూర్చుంది. ఈ సినిమా కోసం మ‌హేష్‌, మురుగ‌దాస్ అందుకొంటున్న పారితోషికం చూసి సౌత్ ఇండియ‌న్ సినిమా మొత్తం ముక్కున వేలేసుకొంది. మ‌హేష్‌కి ఈ సినిమాకి గానూ… రూ.24 కోట్లు ద‌క్క‌బోతున్నాయ‌ట‌. ఒక్క మురుగ‌దాసే ఈ సినిమాకి రూ.18 కోట్ల పారితోషికం అందుకొంటున్నాడ‌ని టాక్‌. వీరిద్ద‌ర్నీ ప‌క్క‌న పెడితే క‌థానాయిక‌గా ఎంపికైన ప‌రిణితీ చోప్రాకి రూ.3.5 కోట్లు క‌ట్ట‌బెట్టార‌ట‌. అంటే ఈ ముగ్గురి పారితోషికాల‌కే 45 కోట్ల రూపాయ‌ల వ‌ర‌కూ ఖ‌ర్చ‌వుతోంద‌న్న‌మాట‌,.

మ‌హేష్‌, మురుగ‌దాస్ అంటే ఆ మాత్రం పారితోషికం ఇవ్వ‌డంలో త‌ప్పులేదు. బాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకొంది కాబ‌ట్టి ప‌రిణితి కూడా అంత అందుకోవ‌డానికి అర్హురాలే.కాక‌పోతే.. మ‌హేష్ సినిమాల్లో హీరోయిన్ పాత్ర వ‌ల్ల కొత్త‌గా ఒరిగే మైలేజీ ఏం ఉండ‌దు. సౌతిండియ‌న్ హీరోయిన్‌ని తీసుకొంటే స‌రిపోతుంది. ఎందుకంటే మురుగ‌దాస్ సినిమాని బాలీవుడ్‌లో విడుద‌ల చేసే ఛాన్స్ లేదు. ఎందుకంటే సౌత్‌లో హిట్ట‌యిన సినిమాని ఆటోమెటిగ్గా ఆయ‌న హిందీలో రీమేక్ చేస్తుంటారు. కాబ‌ట్టి మ‌హేష్ సినిమాని బాలీవుడ్‌లో డ‌బ్ చేసే అవ‌కాశం లేదు. అలాంట‌ప్పుడు బాలీవుడ్ హీరోయిన్‌ని అంత పెట్టి తీసుకోవ‌డంలో అర్థం లేద‌ని సినీ విశ్లేష‌కులు అభిప్రాయ ప‌డుతున్నారు. అయితే చిత్ర‌బృందం వాద‌న ఇంకోలా ఉంది. మ‌హేష్ – ప‌రిణితి అంటే ఈ కాంబినేషన్ వ‌ల్ల సినిమాకి కొత్త లుక్ వ‌స్తుందంటున్నారు. అదీ నిజ‌మే క‌దా.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close