పవన్‌కల్యాణ్‌, మీకు క్లారిటీ వచ్చిందా లేదా?

డియర్‌ పవన్‌కల్యాణ్‌…

ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో కేంద్రం మరియు ప్రధాని నరేంద్రమోడీ ఎలాంటి వైఖరి అనుసరించబోతున్నారో మీకు ఇప్పటికైనా అర్థం అయిందా? ప్రత్యేకహోదా విషయంలో ఆంధ్రప్రదేశ్‌ను నట్టేట ముంచేయడానికి కేంద్రం కంకణం కట్టుకున్నట్లుగా.. తొలినుంచి రాష్ట్ర ప్రజలకు అనేక సంకేతాలు కనిపిస్తూనే ఉన్నాయి. అయితే తమకు మాత్రం ఎన్నడూ ఆ సంగతి అర్థం కాలేదు. మొన్నటికి మొన్న హోదా విషయంలో ఇక లేనట్లే అనే తరహాలో కేంద్రమంత్రి వ్యాఖ్యానించినప్పుడు కూడా.. తమరు ఒక ట్వీట్‌ చేశారు. ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికి, రోడ్ల మీదకు రాకముందే అధికార పార్టీ ఎంపీలు ఉద్యమించాలని తమరు కోరారు. కేంద్రం హోదాను ఇస్తుందా లేదా అనే విషయంలో మీకు ఇంకా కొన్ని సందేహాలు గానీ, ఆశలుగానీ ఉన్నట్లుగా ఆ ట్వీట్‌ ధ్వనిస్తున్నది.

అయితే మీకు మరింత క్లారిటీ ఇవ్వడానికా అన్నట్లుగా ఆర్థిక శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వకంగా ఎలాంటి శషబిషలకు ఆస్కారం లేకుండా.. తెగేసి చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌కు హోదా కుదరదని చెప్పేశారు. మీలో ఆగ్రహం ఉప్పొంగడానికి ఇంకా ఏం కావాలి.

ఈ అవకాశవాద రాజకీయ నాయకుల మీద తెలుగు ప్రజలకు నమ్మకం లేదు. అవకాశవాదంతో అధికారానికి కొమ్ముకాస్తూ.. అధికారం ఉన్న వారి ప్రాపకంలో వారి మోచేతి నీళ్లు తాగడానికి, వారికి అయిష్టమైన పనులేమీ చేయకుండా తమ స్వార్థపూరిత పనులను చక్కబెట్టుకోవడమే ఈ నేతలకు తెలిసింది. అందుకే వారి మీద ప్రజలకు ఎలాంటి నమ్మకమూ లేదు. హోదా విషయంలో ఈ నాయకులు అందరూ పార్టీ రహితంగా పోరాడి రాష్ట్రానికి ఏమైనా సాధిస్తారనే నమ్మకం సన్నగిల్లిపోతున్నది. హోదా విషయంలోనే కాదు, కనీసం రెవిన్యూలోటు పూడ్చవలసిన బాధ్యత కూడా తమ మీద లేదని కేంద్రం తేల్చేసింది.

ఏం జరిగినా సరే అది మీ వంటి వారు పూనుకోవడం ద్వారా మాత్రమే, ప్రజల్లో చైతన్యం తీసుకురావడం ద్వారా మాత్రమే, అగ్రస్థానంలో ఉండి ఒక ప్రజా ఉద్యమాన్ని ముందుకు నడిపించడం ద్వారా మాత్రమే సాధ్యం అవుతుందని జనం నమ్ముతున్నారు. మరి రాష్ట్రం కోసం, ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకోసం ఉద్యమించడానికి, రోడ్డు మీదకు రావడానికి మీకు ఖాళీ ఉందా? ఇప్పుడు కాకపోతే.. మరెప్పుడూ మీరు ఇలాంటి సమష్టి ప్రయోజనం కోసం ఉద్యమించాల్సిన అవసరం రాకపోవచ్చు. ఇప్పుడు జరుగుతున్న అన్యాయాన్ని స్పష్టంగా ముసుగులో గుద్దులాటలు లేకుండా ప్రతిఘటించకపోతే.. మీమీద కూడా జనానికి నమ్మకం సడలిపోవచ్చు.

మీరు మాటల మనిషి కాదని జనానికి తెలుసు. కాకపోతే మీరు కేవలం ట్వీట్ల మనిషి అని అంతా అనుకునే పరిస్థితి తెచ్చుకోవద్దు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందా లేదా? అని నిరీక్షించే పర్వం దాటిపోయింది. ఇంకా వేచిచూడడానికి ఏమీ లేదు. రాష్ట్రం కోసం ఏమైనా చేసే ఉద్దేశం మీకు ఉంటే గనుక.. ఇప్పుడే ఇక కార్యరంగంలోకి దిగండి. మీకున్న పరిచయాలతో మోడీ తో భేటీ అవుతారో, కేంద్రంలోని ఇతర పెద్దలతో భేటీ అవుతారో ఒక ప్రయత్నం చేయండి. ఆ తర్వాత.. అవి విఫలమైతే గనుక.. ప్రజా ఉద్యమానికి శ్రీకారం చుట్టండి. రాష్ట్రవ్యాప్తంగా జనాన్ని ఉవ్వెత్తున ప్రభావితం చేయగల మీలాంటి వ్యక్తి ఎవరో ఒకరు పూనుకుంటే తప్ప రాష్ట్రానికి న్యాయం జరగదు. ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోవద్దు. రాష్ట్రానికి ఏదైనా మంచి చేయగలిగే అవకాశాన్ని విడిచేయవద్దు. స్పందించి జనంలోకి రావడానికి ప్రయత్నించండి. హోదా కాదు కదా.. కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సిన సమస్తమూ రాబట్టుకోవడం కుదురుతుంది.

-మీ, తెలుగు ప్రజలు

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close