పవన్ సార్‌.. ఈ ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం చెప్పండి!

ప‌వ‌న్ క‌ల్యాణ్ పోరాటానికి చిత్ర‌సీమ నుంచి మంచి స్పంద‌నే వ‌చ్చింది. హీరోలంతా ఇప్పుడు ఒక్క‌ట‌వ్వ‌డానికి రెడీ అయ్యారు. అభిమానులు ఎలాగూ ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంట ఉన్నారు. కానీ.. కొంత‌మంది ఫ్యాన్స్ మాత్రం ప‌వ‌న్‌ని పాజిటీవ్ కోణంలోంచే కొన్ని ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఓ అభిమాని ప‌వ‌న్‌కి 9 ప్ర‌శ్న‌లు సంధించాడు. అందులో చాలా ప్ర‌శ్న‌ల్లో నిజాయ‌తీ క‌నిపిస్తోంది. మ‌రి ప‌వ‌న్ ఫ్యాన్‌… లేవ‌నెత్తిన ఆ తొమ్మిది ప్ర‌శ్న‌లేంటి??

1. ఏ తల్లికి అవమానం జరిగినా స్పందించాలి. ఎక్కడ అవమానం జరిగినా ఖండించాలి. కానీ ఓ అమ్మాయి సినీ జీవితంలో కొనసాగాలంటే… శీలాన్నే ఫణం గా పెట్టాల్సి వస్తోందని రోడ్డు పైకి వస్తే.. పోలీసు స్టేషన్ కి వెళ్లాలని చెప్పిన మనం… మనకు జరిగిన అవమానానికి మాత్రం పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండా.. ఈ రోడ్డెక్కి ఆరోపణలు ఏంటి అని అడుగుతున్నారు? సార్!

2. అమ్మకు అవమానం… ఆన్ పార్లమెంటరీ మాట…
అమ్మాయిల శీలం… వీటిలో దేన్ని సీరియస్ గా తీసుకోవాలి అంటే ఏం చెప్పాలి? సార్!

3. మన పార్టీ ఆవిర్భావం… మన సినిమాల వేడుకలు… ఆహా..ఓహో… అనే పొగడ్తలు… చేసినప్పుడు మనకు గుర్తు రాని… మీడియా యాజమాన్యాలు… వారి ఆర్ధిక లావాదేవీలు… ఇప్పుడు మనల్ని విమర్శించే వారి వార్తలు వేసినప్పుడే గుర్తుకు రావడం… ఎంతవరకు సమంజసం అని నిలదీస్తుంటే ఏమని స్పందించాలి? సార్!

4. కేన్సర్ బాధితులకు మీరు ప్రాణం పోసారని.. ఉద్దానంలో మీ ఉద్యమం ప్రభుత్వాన్ని కదిలించిందని అన్నప్పుడు…. ఎన్ని కోట్లు తీసుకుని మీడియా కవర్ చేసిందో చెప్పమంటే ఎలా చెప్పాలి? సార్!

5. తొలిప్రేమలో నందిని… సినిమా జీవితంలో రేణూ దేశాయి… రాజకీయ ప్రస్థానం లో అన్నా లేజ్నోవా … ఇలా మీరు సహా ధర్మచారిణులుగా చేసుకున్నాప్పుడు.. అది వ్యక్తి గత జీవితం అని చాలా మంది అన్నప్పుడు… అందరితో పాటు మీడియా పెద్దలు సైతం సమర్ధించినప్పుడు… మహిళా సంఘాల గొంతులు అంతగా వినిపించలేనప్పుడు.. వీళ్లంతా అప్పట్లో అమ్ముడు పోయారంటున్న ప్రశ్నలకు… ఎంత ఖర్చయిందని చెప్పాలి? సార్!

6. Maa ఎన్నికలు దారితప్పి రోడ్డెక్కినప్పుడు.. సినిమా వాళ్ళపై డ్రగ్ బానిసలుగా.. విచారించినప్పుడు… ఏనాడూ పరిశ్రమ తరపున ప్రశ్నించని మనం… Maa ఆఫీసు మెట్లు కూడా ఎక్కని మనం.. ఈ రోజు Maa ఆఫీస్ లో…చేసిన హంగామా… Maa కార్యవర్గం కు ఇచ్చిన అల్టిమేటం తో…పవన్ మా (అమ్మ) గొప్పదా? మూవీ ఆర్టిస్టుల మా(Maa) గొప్పదా అంటే ఏమని చెప్పాలి? సార్!

7. మీడియాలను నడుపుతున్న వారిలో.. దొంగలు-దొరలు జాబితాలు ట్వీట్ చేసిన మనం.. మనంకలసి తిరిగిన…కౌగలించుకున్న… భేటీలు చేసిన…విమర్శిస్తున్న రాజకీయ నాయకుల్లో దొంగలు -దొరలు..లిస్థ్ లు ఎప్పుడు ట్వీట్ చేస్తారంటే ఎప్పుడని చెప్పాలి? సార్!

8. ప్రశ్నించడానికి వచ్చిన మనం… కత్తి మహేష్ ప్రెస్ క్లబ్ సాక్షిగా అడిగిన ప్రశ్నలకు ఇప్పటివరకు … సమాధానం ఎందుకు చెప్పలేదు అంటే… ఏమని చెప్పాలి? సార్!

9. చివరిగా….. ఇంత చర్చకు దారి తీసిన క్యాస్టింగ్ కౌచ్… మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో … మనం ఉందని చెప్పాలా? లేదని చెప్పాలా? సార్!

రేపటి నుంచి మన కార్యాచరణ ప్రారంభమవుతుందన్నారు మీరు. ఈ ప్రశ్నలకు మేము ఏం సమాధానం చెప్పాలో చెబితే చాలు… మీ అభిమానులుగా … మా కార్యాచరణ ప్రారంభించేస్తాం.
జై పవర్ స్టార్…! జై జై పవర్ స్టార్….!!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

టీ 20 ప్ర‌పంచ‌క‌ప్: భార‌త జ‌ట్టు ఇదే

జూన్‌లో జ‌ర‌గ‌బోయే టీ 20 వ‌ర‌ల్డ్ క‌ప్ కోసం భార‌త‌జ‌ట్టుని బీసీసీఐ ప్ర‌క‌టించింది. రోహిత్ శ‌ర్మ‌ని కెప్టెన్‌గా నియ‌మించింది. గాయం కార‌ణంగా జ‌ట్టుకు దూర‌మై, ప్ర‌స్తుతం ఐపీఎల్ లో బ్యాటర్‌, కీప‌ర్ గా...

గాజు గ్లాస్ గుర్తుపై ఏ క్షణమైనా ఈసీ నిర్ణయం – లేకపోతే హైకోర్టులో !

జనసేన పార్టీకి గాజు గ్లాస్ గుర్తు రిజర్వ్ చేసినప్పటికీ ఆ పార్టీ పోటీ చేయని స్థానాల్లో స్వతంత్రులకు గుర్తు కేటాయించడంపై తీవ్ర వివాదాస్పదమయింది. ఈ అంశంపై జనసేన హైకోర్టును ఆశ్రయించింది. ఈ సందర్బంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close