అఖిలప‌క్షం గురించి ప‌వ‌న్ ఆనాడు చెప్ప‌లేదే..!

జ‌న‌సేన పాద‌యాత్ర చేస్తున్న సంగ‌తి తెలిసిందే. విభ‌జ‌న స‌మ‌స్య‌ల‌పై పోరాటం చేయ‌డంలో అధికార, ప్ర‌తిప‌క్ష పార్టీలు విఫ‌ల‌మ‌య్యాయ‌నీ, అందుకే తాము పాద‌యాత్ర చేయాల్సి వ‌చ్చింద‌ని విజ‌య‌వాడ‌లో ప‌వ‌న్ క‌ల్యాణ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన విలేక‌రుల స‌మావేశంలో ఆయ‌న మాట్లాడారు. తెదేపా, వైకాపాలు వారి వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల‌నే ప్ర‌త్యేక హోదాను కేంద్రానికి తాక‌ట్టు పెట్టార‌ని ఆరోపించారు. రాష్ట్ర ప్ర‌యోజ‌నాల గురించి తాను తిరుప‌తిలో స‌భ పెడితే, ఆ త‌రువాతే ప్ర‌త్యేక ప్యాకేజీని కేంద్రం ప్ర‌క‌టించింద‌న్నారు. ఆ ప్యాకేజీ బాగులేద‌నీ, దాన్ని పాచిపోయిన ల‌డ్డుల‌తో తాను ఆనాడే పోల్చితే.. అదే అద్భుతం అని ముఖ్య‌మంత్రి అన్నార‌ని చెప్పారు. ఏపీ ప్ర‌యోజ‌నాల విష‌య‌మై కేంద్రాన్ని ప్ర‌శ్నించాలంటే అవిశ్వాస తీర్మానం పెట్టాల‌ని కూడా తానే సూచించాన‌నీ, గ‌డ‌చిన వారంప‌దిరోజులోగా పార్ల‌మెంటు స్తంభించే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్నారు.

అఖిల ప‌క్షం గురించి ప‌వ‌న్ మాట్లాడుతూ… ఏడాది కింద‌టే అఖిల ప‌క్షం గురించి టీడీపీ మాట్లాడి ఉంటే బాగుండేద‌న్నారు. ఇప్పుడు దాంతో ఉప‌యోగం ఏముంటుంద‌ని ప్ర‌శ్నించారు. అఖిల‌ప‌క్షం మీటింగ్ పై న‌మ్మ‌కం పోయింద‌నీ, దాని వ‌ల్ల ఏం ఒరుగుతుందో త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని ప‌వ‌న్ అన్నారు. ముఖ్య‌మంత్రి పిలిచార‌ని వెళ్లి, ఒక కాఫీ తాగి రావ‌డం త‌ప్ప‌.. దాన్లో నిర్మాణాత్మ‌క పోరాట‌ వ్యూహం త‌న‌కు క‌నిపించ‌డం లేద‌న్నారు. ప్ర‌త్యేక హోదాను ఎలా సాధిస్తార‌నేది ముందుగా జ‌న‌సేన ప్ర‌తినిధుల‌తో క్యాబినెట్ మంత్రులు చ‌ర్చించాల్సి ఉంద‌న్నారు. ఆ త‌రువాత‌, త‌మ ఆలోచ‌నా విధానాన్ని తెలియ‌జేస్తామ‌న్నారు. పార్ల‌మెంటు వాయిదా ప‌డిపోయిన ఈ త‌రుణంలో ఎలా ముందుకు వెళ్లాల‌నే స్ప‌ష్ట‌త త‌మ‌కు ఇవ్వాల‌న్నారు.

తిరుప‌తిలో ప‌వ‌న్ ప్ర‌త్యేక హోదా గురించి అడిగారు… ప్యాకేజీని కేంద్రం ప్ర‌క‌టించింది. తాజాగా కేంద్రంపై అవిశ్వాసం పెట్టాల‌ని కూడా ప‌వ‌నే ముందుగా చెప్పారు క‌దా! ఆయ‌న వ‌ల్ల‌నే పార్ల‌మెంటు స‌మావేశాలు స్తంభించిపోయే ప‌రిస్థితి వ‌చ్చింది క‌దా! ఇవ‌న్నీ ప‌వ‌న్ ముందుగానే చెప్పిన‌ప్పుడు… అఖిల ప‌క్షం గురించి కూడా ఏడాది ముందే స‌ల‌హా ఇస్తే స‌రిపోయేది! అప్పుడు పెట్టి ఉంటే బాగుండేద‌ని ఇప్పుడు ఎందుకు వాపోవ‌డం..? స‌రే.. ప్ర‌స్తుతం టీడీపీ పిలుస్తున్న అఖిల ప‌క్షానికి ఎందుకు వెళ్ల‌రంటే… హోదా ఎలా సాధిస్తార‌నే స్ప‌ష్ట‌త ముందుగా ఇవ్వాలట‌..! దాని కోస‌మే క‌దా అఖిల ప‌క్షం పిలిచింది. పార్ల‌మెంటు నిర‌వ‌ధికంగా వాయిదా ప‌డిందీ, భాజ‌పా తీరు దారుణం ఉందీ, అన్ని పార్టీలూ క‌లిసి ఏం చేద్దామ‌ని చ‌ర్చించడం కోస‌మే క‌దా పిలుస్తున్న‌ది. వెళ్ల‌కుండానే స్ప‌ష్ట‌త ఇవ్వాలీ, పోరాటం ఎలాగో చెప్పాలంటే ఎలా సాధ్య‌మౌతుంది..? స‌ల‌హాలు తీసుకునేందుకే క‌దా పిలుస్తున్న‌ది..!

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఆ స్థానాల్లో ఇద్దరేసి అభ్యర్థులకు బీజేపీ బీ ఫాం..!?

పార్లమెంట్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.పోటీ చేసే అభ్యర్థులకు గెలుపు వ్యూహాలను చేరవేస్తూనే..మరోవైపు పార్టీ పరంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలో అన్నింటిని పక్కా ప్లాన్ తో అమలు చేస్తోంది....

కేసీఆర్ బస్సులో లిఫ్ట్.. ఎంట్రీ వేరే లెవల్..!!

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వినియోగిస్తోన్న బస్సు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కేసీఆర్ సౌలభ్యం కోసం బస్సును కొత్త టెక్నాలజీతో అప్డేట్ చేయడంతో బస్సు డిజైన్ ఆకట్టుకుంటోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసాక కేసీఆర్...

రియల్లీ గ్రేట్..50 మందిని కాపాడిన బాలుడు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లోని ఫార్మా కంపెనీ అగ్ని ప్రమాద ఘటనలో ఓ బాలుడి సాహసం 50మందిని ప్రాణాపాయం నుంచి కాపాడింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో ప్రమాదంలో చిక్కుకొని ఆపన్నహస్తం కోసం...

పిఠాపురంపైకి అసాంఘిక శక్తుల దండయాత్ర !

ఒక్కడిని ఒక్కరంటే ఒక్కర్ని ఓడించడానికి అన్ని రకాల మాఫియాల్ని రంగంలోకి దించుతోంది వైసీపీ. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చుపెట్టడమే కాదు.. నకిలీ మద్యంతో ముంచెత్తుతున్నారు. బయట నుంచి ఎర్ర చందనం స్మగ్లర్లు,...

HOT NEWS

css.php
[X] Close
[X] Close