పోసానిని బ్యాన్ చేయవద్దన్న పవన్ !

పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన కుమార్తె, కుటుంబసభ్యులపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిని బ్యాన్ చేయాలని టాలీవుడ్ భావిస్తోంది. ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ అలాంటి ఆలోచన చేయవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ను నిర్మాతలు అమరావతి వెళ్లి మరీ కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన చర్చలు… ఇండస్ట్రీతో రాజకీయంగా ఎలా గేమ్ అడుతున్నారో విశ్లేషించినట్లుగా తెలుస్తోంది. తమ మాట వినకపోతే.. తాము ఏం చెప్పినా ఖండిస్తే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయన్న భయాన్ని కల్పిస్తోందని పవన్ కల్యాణ్‌తో జరిగిన సమావేశంలో నిర్మాతలు ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.

కరోనా పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకున్నా.. బార్లు, స్కూళ్లు సహా అన్నింటికీ పర్మిషన్ ఇచ్చినా ఒక్క ధియేటర్లకు మాత్రమే అనేక రకాల నిబంధనల పెట్టడం దీనికి సంకేతం అన్న అభిప్రాయం వారిలో వినిపించింది. అయితే తాము ఎవరికీ వ్యతిరేకంగా పోరాటం చేయలేమని నిర్మాతలు పవన్ కల్యాణ్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కూడా నిర్మాతలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని.. రాజకీయాలతో వారికి సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.

అదే సమయంలో పోసానిని బ్యాన్ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారని.. అయితే పవన్ కల్యాణ్ అలాంటి నిర్ణయాలు వద్దని వారించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ కల్యాణ్‌ తమ కోసం మాట్లాడినా తాము పవన్ కు మద్దతుగా రాలేకపోవడంపై నిర్మాతలు పరోక్షంగా అయినా వివరణ ఇచ్చుకున్నారని భావిస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close