ప‌వ‌న్ Vs బ‌న్నీ ఫ్యాన్స్‌…. వేడి త‌గ్గ‌లేదు

`చెప్ప‌ను బ్ర‌ద‌ర్‌` అనే ఒకే ఒక్క మాట అల్లు అర్జున్ కీ ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్స్ కీ మ‌ధ్య గ్యాప్ పెంచేసింది. డీజే టీజ‌ర్‌కి వ‌చ్చిన డిజ్ లైక్‌ల సాక్షిగా.. ఆ గ్యాప్ పెరుగుతూ పోతోంది. మెగా హీరోలంతా ఒక్క‌టే న‌ని, ఫ్యాన్స్ కూడా క‌ల‌సి మెల‌సి ఉండాల్సిందే అని అల్లు అర్జున్‌, నాగ‌బాబు, అర‌వింద్‌లాంటివాళ్లు ఎంత మొత్తుకొన్నా అది అర‌ణ్య ఘోషే అవుతోంది. తాజాగా డీజే ఆడియో టీజ‌ర్‌కి వ‌చ్చిన డిజ్ లైక్‌లు చూస్తుంటే.. బ‌న్నీ, వ‌వ‌న్ ఫ్యాన్స్ మ‌ధ్య వైరానికి పుల్ స్టాప్ ప‌డ‌దా?? అనే అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. పంచె క‌ట్టి, బ‌న్నీ వేసిన స్టెప్పుతో.. డీజే టీజ‌ర్‌ని విడుద‌ల చేసింది చిత్ర‌బృందం. ఇప్ప‌టికి ఈ టీజ‌ర్‌కి 20 వేల‌కు పైగా లైక్స్ వ‌స్తే… దాదాపుగా అదే స్థాయిలో డిజ్ లైక్స్ క‌నిపిస్తున్నాయి. ఈ అంకెలు… దిల్ రాజు అండ్ కోకి త‌ల‌నొప్పి తెప్పించే వ్య‌వ‌హారంలానే క‌నిపిస్తోంది.

కామెంట్లని ఓసారి ప‌రిశీలిస్తే.. అవ‌న్నీ అల్లు అర్జున్‌పై `ప‌గ‌బ‌ట్టిన‌` వాళ్ల కామెంట్ల‌లానే క‌నిపిస్తున్నాయి. ఇదంతా ప‌వ‌న్ ఫ్యాన్సే చేస్తున్నార‌ని చెప్ప‌లేం. సంద‌ట్లో స‌డేమియాలా.. నాగ్ మెగా ఫ్యాన్స్ కూడా దూరిపోయి ప‌వ‌న్, బ‌న్నీ ఫ్యాన్స్ మ‌ధ్య దూరానికి ఇతోదికంగా సాయం చేస్తున్నార‌ని అనుకొన్నా త‌ప్పు లేదు. టీజ‌ర్ల‌కే ఇంత నెగిటీవ్‌గా స్పందిస్తుంటే.. ట్రైల‌ర్‌కీ పాట‌ల‌కీ ఏం చేస్తారో, డీజే సినిమా విడుద‌లైన‌ప్పుడు నెగిటీవ్ టాక్‌ని ప‌నిగట్టుకొని ప్ర‌చారం చేస్తారేమో అని అల్లు అర్జున్ ఫ్యాన్స్ భ‌య‌ప‌డుతున్నారు. కానీ.. దిల్ రాజు అంత తెలివిత‌క్కువోడేం కాదు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఎలా దారిలోకి తెచ్చుకోవాలో త‌న‌కు బాగా తెలుసు. పైగా ద‌ర్శ‌కుడు హ‌రీష్ శంక‌ర్‌.. ప‌వ‌న్‌కి వీర భ‌క్తుడు. ప‌వ‌న్ ఫ్యాన్స్‌ని ఎక్ట్రాక్ట్ చేసే విష‌యాలేవో డీజేలో మిక్స్ చేసి… వాళ్ల‌ని శాంతించే అవ‌కాశాలు మాత్రం కోకొల్ల‌లుగా క‌నిపిస్తున్నాయి. డీజే ఆడియో ఫంక్ష‌న్‌లోనో, ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనో ప‌వ‌న్ క‌నిపించినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com