ఆ రెండు సినిమాల్ని ఇబ్బందిలో పెట్టిన ‘పెంగ్విన్’

అమేజాన్ ప్రైమ్‌లో విడుద‌లైన కీర్తి సురేష్ సినిమా ‘పెంగ్విన్‌’కి స‌రైన రిజ‌ల్ట్ రాలేదు. భారీ రేటుకి ఈసినిమా కొన్న అమేజాన్‌, డ‌బ్బులు బాగా ఖ‌ర్చు పెట్టి ప్ర‌చారం కూడా చేసింది. కానీ… గిట్టుబాటు కాలేదు. ‘పెంగ్విన్‌’ ప్ర‌తికూల ఫలితం ఓటీటీపై ఆశ‌లు పెట్టుకున్న చాలా సినిమాల‌కు, వాటి ఆశ‌ల‌కు క‌ళ్లెం వేసిన‌ట్టైంది. అంతెందుకు…? కీర్తి న‌టించిన రెండు సినిమాల్ని సైతం ఇబ్బందుల్లోకి నెట్టింది.

కీర్తి న‌టించిన ‘మిస్ ఇండియా’, ‘గుడ్ ల‌క్ స‌ఖీ’ ఇప్పుడు విడుద‌ల‌కు రెడీ అయ్యాయి. థియేట‌ర్లు ఓపెన్ కాని ప‌క్షంలో ఓటీటీలోనే నేరుగా విడుద‌ల చేయాల‌ని నిర్మాత‌లు భావించారు. ‘పెంగ్విన్‌’కి మంచి రేటు ద‌క్క‌డం ఆయా నిర్మాత‌ల‌కు భ‌రోసా క‌లిగించాయి. ‘పెంగ్విన్‌’ గ‌నుక హిట్ట‌యితే.. త‌మ సినిమాల‌కు మ‌రింత మంచి రేటు వ‌స్తుంద‌ని భావించారు. కానీ… `పెంగ్విన్‌`కి నెగిటీవ్ టాక్ రావ‌డం, పెట్టిన పెట్టుబ‌డికీ, వ్యూవ‌ర్ షిప్‌కీ పొంతన లేక‌పోవ‌డం నిరాశ క‌లిగించాయి. అలా…. ‘మిస్ ఇండియా’, ‘గుడ్ ల‌క్ స‌ఖీ’ల ఓటీటీ ఆశ‌ల‌పై ‘పెంగ్విన్’ నీళ్లు చ‌ల్లిన‌ట్టైంది. ‌

క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు ఫ్లాప్ అయినా, క‌థానాయిక‌ల‌పై పెద్ద భారం ప‌డ‌దు. కానీ సోలో సినిమాలు అలా కాదు. క‌థానాయిక‌ల డౌన్ ఫాల్‌కి ఒక్క ఫ్లాప్‌ చాలు. అదే కీర్తి భ‌యం కూడా. ‘మిస్ ఇండియా’, ‘గుడ్ ల‌క్ స‌ఖీ’ చిత్రాల్లో ఒక్క హిట్టు కొట్టినా, కీర్తి ఫామ్ కంటిన్యూ అవుతుంది. లేదంటే మాత్రం – క‌థ‌ల ఎంపిక విష‌యంలోనూ, జోన‌ర్ల విష‌యంలో… కీర్తి మ‌రోసారి పున‌రాలోచించాల్సిందే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close