చైతన్య : ఆ బూతు నేతల్ని శిక్షించాల్సింది ప్రజలే !

బూతు నేతలు ఏపీలో ఎక్కువైపోయారు. తల్లుల్ని.. చెల్లెళ్లను కూడా వదిలి పెట్టడం లేదు. ప్రజాస్వామ్యంలో వీరికి ఓ హోదా వచ్చిందంటే దానికి కారణం ప్రజలు.. ఇలా ఇతర మహిళల వ్యక్తిత్వాలను కంచ పరుస్తామని… బండ బూతులు తిడతామని ముందుగా ప్రజలకు చెప్పి ఉంటే.. లేకపోతే తెలిసి ఉంటే.. ఇలాంటి వాళ్లను అసలు చట్టసభలకు పంపేవారు కాదేమో. కానీ ప్రజలకు తాము బుద్దిమంతులం అనే రీతిలో కనిపించి ఓట్లేయించుకుని వారి పరువు తీస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు బుద్ది చెప్పాల్సింది కూడా ప్రజలే.

మహిళా లోకాన్ని కించ పర్చిన కొడాలి నాని !

చంద్రబాబు కుటుంబంపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు మహిళా లోకానికే మచ్చ లాంటివి. చంద్రబాబు, లోకేష్‌లను మానసికంగా దెబ్బకొట్టాలనుంటే వారి ఇంట్లో ఆడవాళ్లను కించపర్చడమే మార్గమనుకున్నారు కొడాలి నాని వారి వ్యాఖ్యలకు తట్టుకోలేక చంద్రబాబు కన్నీరు పెట్టుకున్నారు. అయితే ఇప్పుడు ఆ దాడి తగ్గడం లేదు. కొడాలి నాని అంత కంటే దారుణణమైన భాషతో మరోసారి విమర్శలు గుప్పించారు . ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఎంత రాజకీయ ప్రత్యర్థి అయితే మాత్రం ఇంట్లో మహిళల్ని ఇలా తిడతారా అని అనే చర్చ అంతటా జరుగుతోంది. నారా భవనేశ్వరి ప్రత్యక్ష రాజకీయాల్లో ఎప్పుడూ లేరు. ఆమె ఎన్టీఆర్ కుమార్తె.. చంద్రబాబు సతీమణి. అయినంత మాత్రాన ఇష్టారాజ్యాంగా ఆమె వ్యక్తిత్వాన్ని కించ పరిచడం మహిళా లోకంలోనే తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది.

పార్టీ పెద్దలు పదవులు ఆశ చూపబట్టే రెచ్చిపోతున్న నేతలు !

ఏపీ వైఎస్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ భాష దిగజారిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. పరిధి దాటుతున్న వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఎప్పుడూ నిలువరించకపోగా పదవులతో ప్రోత్సహించిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. పలువురు నేతలకు అదే అర్హతగా పదవులు లభించాయన్న విశ్లేషణలు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కేబినెట్ మీటింగ్‌లో గట్టిగా ఎదురుదాడి చేయడం లేదని సీఎం సీరియస్ అయ్యారని ప్రచారం జరిగిన తర్వాత వైఎస్ఆర్‌సీపీలో కొంత మంది నేతలు పరిధి దాటిపోతున్నారు. వరుసగా చంద్రబాబును .. ఆయన కుటుంబసభ్యుల్ని విమర్శల పేరుతో బూతుల దాడి చేయడమే పరమావధిగా పెట్టుకున్నారు. ఇవాళ తిట్టించుకున్న వాళ్లు రేపు తిట్టకపోతే తాము చేతకాని వాళ్లం అనే ముద్ర పడుతుందని అంతకు రెట్టింపు ఇస్తారు. దాని వల్ల ఏం జరుగుతుంది…? ఈ బూతుల ప్రవాహం కంటిన్యూ అవుతుంది. అది రాజకీయానికి ఏ మాత్రం మేలు చేయదు. రాజకీయ వ్యవస్థ విలువనే దిగజారుస్తుంది.

మేల్కోవాల్సింది ప్రజలే !

ఇలాంటి నేతల్ని ప్రజలు సహిస్తారా? శిక్షిస్తారా అన్నది మళ్లీ వారికి ఓటు వినియోగించుకునే చాన్స్ వచ్చినప్పుడే తేలుతుంది. తాము ఎన్నుకునే నేతలు అలాంటి వాళ్లు కాదని.. ఎన్నికన వాళ్లే నిరూపించాల్సి ఉంది. దురదృష్టవశాత్తూ అదే జరగడం లేదు. ప్రజలు ఇలాంటి నేతల్ని దూరంగా పెట్టకోపతే… అది ఎప్పటికైనా తమ వద్దకే వస్తుంది. తిట్టింది తమను కాదుగా అని … దూరంగా విని ఆనందిస్తే.. అది రేపు మీద దగ్గరకే వస్తుంది. ఇలాంటి నేతల్ని ప్రోత్సహించడం .. పాముకు పాలుపోయడం లాంటిదే. దీనికి సాక్ష్యం చంద్రబాబే. కొడాలి నానిని ప్రోత్సహించి.. ఆయన చేత తిట్లు తింటోంది ఆయనే.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close