కోదండ‌రామ్ తొలి విజయం సాధించిన‌ట్టే..!

తెలంగాణ జ‌న స‌మితి (టి.జె.ఎస్‌.) తొలి విజ‌యం సాధించింద‌నే చెప్పాలి. కొత్త పార్టీని కోదండ‌రామ్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే, పార్టీ ఆవిర్భావ స‌భ ఎక్క‌డ నిర్వ‌హిస్తారూ, ఎప్పుడు నిర్వ‌హిస్తార‌నే అంశంపై నేటి వ‌ర‌కూ స‌స్పెన్స్ కొన‌సాగుతూనే వ‌చ్చింది. మొద‌ట్లో వ‌రంగ‌ల్ అనుకున్నారు. ఆ త‌రువాత‌, హైద‌రాబాద్ కి వేదిక మార్చారు. అక్క‌డి నుంచి అనుమ‌తుల స‌మ‌స్య కోదండ‌రామ్ ను వెంటాడింది. నిజాం కాలేజ్ గ్రౌండ్ లో పెడ‌దామ‌నుకుంటే పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఎన్టీఆర్ స్టేడియం అడిగినా అదే ప‌రిస్థితి..! పేరేడ్ గ్రౌండ్ లో అయినా అనుమ‌తి ఇవ్వాలంటూ పార్టీ అర్జీ పెట్టుకుంది. అయినాస‌రే, పోలీసులు కుద‌ర‌దు అన్నారు. చివ‌రికి స‌రూర్ న‌గ‌ర్ స్టేడియంలో స‌భ పెట్టుకుంటామ‌ని టీజేయ‌స్ కోరింది. అక్క‌డ కూడా ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో రాచ‌కొండ పోలీసులు అనుమ‌తి ఇవ్వ‌లేదు.

దీంతో కోదండ‌రామ్ హైకోర్టును ఆశ్ర‌యించారు. పార్టీ దాఖ‌ల‌ను చేసిన పిటీష‌న్ ను కోర్టు విచారించింది. తెలంగాణ జ‌న స‌మితి స‌భ‌కు అనుమ‌తి ఇవ్వాల‌ని ఆదేశించింది. అంతేకాదు, అనుమ‌తుల కోసం మ‌రోసారి రాచకొండ పోలీసుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవాల‌ని పార్టీకి కోర్టు సూచించింది. పార్టీ నేత‌లు ద‌ర‌ఖాస్తు పెట్టిన వెంట‌నే మూడు రోజుల్లోగా స‌భ నిర్వ‌హ‌ణ‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని రాచ‌కొండ పోలీసుల‌ను కోర్టు ఆదేశించింది. దీంతో ఆవిర్భావ స‌భ నిర్వ‌హ‌ణ‌పై నెల‌కొన్న స‌స్పెన్స్ తొలిగిన‌ట్ట‌యింది.

అయితే, ఇది తొలి విజ‌యం అంటూ టీజేయ‌స్ మ‌ద్ద‌తుదారులు అంటున్నారు. ఆవిర్భావ స‌భ‌ను అడ్డుకోవ‌డం కోసం ఎన్ని ర‌కాలు కుట్ర‌లు జ‌రిగినా, చివ‌రికి న్యాయం త‌మ‌వైపే ఉంద‌ని అభిప్రాయ‌ప‌డుతున్నారు. తాజా తీర్పుతో ఈ నెల 29 నిర్వ‌హించ‌బోయే స‌భ ఏర్పాట్ల‌లో కోదండ‌రామ్ నిమ‌గ్న‌మైన‌ట్టు తెలుస్తోంది. ఈ స‌భ‌కు పెద్ద సంఖ్య‌లో ప్ర‌జ‌లు వ‌చ్చేలా స‌న్నాహాలు చేస్తున్నారు. నిజానికి, జ‌న స‌మితి ఆవిర్భావ స‌భకు ర‌క‌ర‌కాల కార‌ణాల‌తో అధికారులు అనుమ‌తి నిరాక‌రిస్తుండటంతో విమ‌ర్శ‌లు పెరిగాయి. తాము స‌భ పెడ‌తామంటే వాహ‌నాలూ కాలుష్యం అని అడ్డుప‌డుతున్నార‌నీ, భ‌ర‌త్ అనే నేను సినిమా వేడుక‌ల‌కి ఎల్బీ న‌గ‌ర్ స్టేడియంలో ఎలా అనుమ‌తి ఇచ్చారంటూ కోదండ‌రామ్ ఇటీవ‌లే మండిప‌డ్డ సంగ‌తి తెలిసిందే. ఈరోజు కోర్టు నుంచి సానుకూల ఆదేశాలు రావ‌డంతో తెలంగాణ జ‌న స‌మితి శ్రేణుల్లో ఉత్సాహం నిండింది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close