క్రైమ్ : పోలీసుల్నే వేధించిన కిలాడీ లేడీ..!

సాధారణంగా పోలీసులు వేధిస్తూ ఉంటారు. కానీ పోలీసుల్నే వేధిస్తే…! ఆ క్యారెక్టర్ కాస్త డిఫరెంటే. అందులోనూ ఆమె లేడీ అయితే… ఇంకాస్త ప్రత్యేకమే. అలాంటి క్యారెక్టర్ ఒకటి పోలీసుల్ని గడగడలాడిస్తూ దొరికిపోయింది. కాకపోతే.. పోలీసులు ఆమెను వేరే కేసులో బుక్ చేయగలిగారు. తమను వేధించిందని చెప్పుకోలేకపోయారు. సొంతంగా కేసులు పెట్టలేకపోయారు. ఈ క్రైమ్ స్టోరీలో అదే ట్విస్ట్.

హైదరాబాద్‌ రాచకొండ కమిషనరేట్ పరిధిలో కిలాడీ లేడీ లతారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను అరెస్ట్ చేసిన కారణం ఒకరు తనను దూషించిందని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టడం. ఇలాంటి ఫిర్యాదు కోసమే ఎదురు చూస్తున్న పోలీసులు క్షణం ఆలస్యం చేయకుండా ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులపై ఆమెపై ఎందుకంత కోపం అంటే… వారిని కూడా ఆమె మామూలుగా టార్చర్ పెట్టలేదుమరి. మొత్తంగా ఆరుగురు ఎస్సైలు ఆమె బారిన పడ్డారు. ఏదో ఒక విషయంలో పీఎస్‌కు వెళ్లి పోలీసులతో పరిచయం పెంచుకుని.. వారితో సన్నిహితంగా వ్యవహరించడం ప్రారంభిస్తుంది. తర్వాత దానికి సంంబంధించిన ఆధారాలను సేకరించుకుని మెల్లగా బ్లాక్ మెయిల్ చేయడం ప్రారంభిస్తుంది. ఇలా మొత్తంగా ఆరుగురు ఎస్సైలో లతారెడ్డి బుట్టలో పడ్డారు. అడిగినప్పుడల్లా డబ్బులు సమర్పించుకుంటున్నారు.

అడిగినప్పుడల్లా డబ్బులు ఇవ్వకపోతే… లతా రెడ్డి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసేది. ఆధారాలను సమర్పించేది. ఉన్నతాధికారులు.. అంతర్గత విచారణ జరిపేవారు. ఈ బాధలన్నీ ఎస్సైలు పడేవారు. అయితే.. తప్పు ఎస్సైలది కూడా ఉంది. ఆమె సన్నిహితంగా మాట్లాడితే.. బెండైపోయింది వాళ్లే కాబట్టి.. లతారెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు పోలీసులు ధైర్యం చేయలేదు. చివరికి వేరే కేసులో అరెస్ట్ చేయాల్సి రావడంతో కసి తీర్చుకున్నారు.

లతారెడ్డి టైలర్‌గా పని చేస్తూంటారు. కానీ ఆమె ఇలా బ్లాక్ మెయిలింగ్‌కు అలవాటు పడిందని పోలీసులు చెబుతున్నారు. అయితే.. నేరుగా పోలీసుల్నే టార్గెట్ చేయడం…. వారితో ఓ ఆట ఆడుకోవడం… ఎస్‌సైలు ఆమె ట్రాప్‌లో పడటం మాత్రం పోలీసు డిపార్టుమెంట్‌ బలహీనతల్ని బయట పెడుతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మంగళగిరిలో ఆకట్టుకుంటున్న నారా బ్రహ్మణి ప్రచార శైలి

నారా లోకేష్ సతీమణి మంగళగిరి నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. నారా లోకేష్ మంగళగిరిలో అందుబాటులో ఉండని సమయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. రెండు, మూడు వారాలుగా విస్తృతంగా మంగళగరిలో అన్ని వర్గాల...

కూటమి ప్రభుత్వంలో వంగవీటి రాధాకృష్ణకు కీలక పదవి !

వంగవీటి రాధాకృష్ణ తెలుగుదేశం పార్టీ కోసం నిస్వార్థంగా ప్రచారం చేస్తున్నారు. దెందలూరు సభలో వంగవీటి రాధాకృష్ణను చంద్రబాబు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఆయన ఏమీ ఆశించకుండా పార్టీ కోసం పని చేస్తున్నారని ఏ...

అభివృద్ధితో సంక్షేమం – టీడీపీ, జనసేన మేనిఫెస్టో కీలక హామీలు

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. సంక్షేమం, రాష్ట్రాభివృద్ధి కోసం ఐదేళ్లు ప్రజలకు ఏం చేయబోతున్నారో మేనిఫెస్టో ద్వారా వివరించారు. ఇప్పటికే ప్రజల్లోకి వెళ్లిన సూపర్...

ఏపీలో ఎన్నికల ఫలితం ఎలా ఉండనుంది..ఆ సర్వేలో ఏం తేలిందంటే..?

ఏపీలో సర్వే ఏదైనా కూటమిదే అధికారమని స్పష్టం చేస్తున్నాయి. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా కూటమి తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వస్తుందని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే రైజ్ ( ఇండియన్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close