జూనియర్ ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణ మురళి

నటుడు, రచయిత, దర్శకుడు అయిన పోసాని కృష్ణమురళి ఎప్పటినుండో వైఎస్ఆర్సిపి కి మద్దతు ఇస్తున్నారు. గతంలో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా నిలబడి పోటీ చేసి ఆయన ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే జూనియర్ ఎన్టీఆర్ గురించి ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూలో పోసాని కృష్ణమురళి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.‌

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ పరిస్థితి దయనీయంగా ఉంది. ఇటు తెలంగాణలో కేసీఆర్ అటు ఆంధ్రప్రదేశ్ లో జగన్, కేంద్రంలో మోడీ ముగ్గురు కూడా చంద్రబాబు మీద పగ పట్టినట్లుగా ప్రవర్తిస్తుండడంతో పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా కనిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు బిజెపిలోకి ఫిరాయించడం, త్వరలోనే ఎమ్మెల్యేలు కూడా పార్టీ ఫిరాయించి తీరతారని వార్తలు వస్తుండడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులలో నిరుత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు తెలుగుదేశం పార్టీ అభిమానులు జూనియర్ ఎన్టీఆర్ చేతికి పగ్గాలు ఇస్తే తెలుగుదేశం పార్టీకి మళ్లీ పూర్వవైభవం వస్తుందని చెబుతూ వస్తున్నారు. ఈ వాదనతో విభేదించేవారు సైతం జూనియర్ ఎన్టీఆర్ శక్తిసామర్థ్యాల మీద నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు, లోకేష్ తో పోలిస్తే జూనియర్ ఎన్టీఆర్ పార్టీని మరింత చక్కగా నడపగలరని వారు అంటున్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై పోసాని కృష్ణమురళి ని స్పందించమని కోరగా ఆయన, తెలుగుదేశం పార్టీని పైకి లేపడం జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా కాదని తేల్చి చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చినంత మాత్రాన తెలుగుదేశం పార్టీ లో అద్భుతాలు ఏమీ జరగవని పోసాని అభిప్రాయపడ్డారు. అయితే ఇది జూనియర్ ఎన్టీఆర్ ఒకరికి మాత్రమే కాదని సినిమా హీరోలు అందరికీ వర్తిస్తుందని, సినిమా హీరో లను ప్రజలు నమ్మే రోజులు పోయాయని పోసాని వ్యాఖ్యానించారు.

ఏది ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ వల్ల కూడా తెలుగుదేశం పార్టీ పునరుజ్జీవం పొందుకో లేదని చెప్పడం ద్వారా పోసాని, వైఎస్ఆర్సిపి పార్టీ పట్ల తన విధేయతను చాటుకున్నారని చెప్పవచ్చు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

క‌ల్కి.. క‌మ‌ల్.. కంశుడు!

ప్ర‌భాస్ అభిమానులే కాదు, ఇండియ‌న్ సినిమా మొత్తం ఆశ‌గా ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్.. 'క‌ల్కి'. ప్ర‌భాస్ తో పాటు అమితాబ్ బ‌చ్చ‌న్‌, క‌మ‌ల్ హాస‌న్ లాంటి దిగ్గ‌జాలు ఈ సినిమాలో న‌టిస్తున్నారు. ప్ర‌భాస్‌,...

దర్శి రివ్యూ : హోరాహోరీ – కానీ బూచేపల్లికి ఎన్నో మైనస్‌లు !

మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ గెలిచిన రెండే మున్సిపాలిటీల్లో ఒకటి దర్శి. రెండోది తాడిపత్రి. తాడిపత్రిలోనూ కష్టం మీద గెలిచారు కానీ దర్శిలో మాత్రం టీడీపీ స్వీప్ చేసింది. నిజానికి అక్కడ నాయకుడు...

గత ఎన్నికలలో వైసీపీ కోసం ప్రచారం చేసిన వాళ్లేరి ?

అధికార అహంకారం జగన్మోహన్ రెడ్డిని అందరికీ దూరం చేసింది. తాను ఎవరి సాయంతో అధికారం అందుకున్నారో .. వాళ్లందర్నీ అవమానించి , వేధించడంతో దూరమయ్యారు. ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి వైసీపీ...

గాజు గ్లాస్ గందరగోళం : తప్పు ఎవరిది ? నిర్లక్ష్యం ఎవరిది ?

రాజకీయం అంటేనే కుట్రలు, కుతంత్రాల సమాహారం. తాము గెలవాలంటే ప్రత్యర్థి ఓడాలి. అలా చేయాలంటే నేరుగా అయ్యా..బాబూ అని ప్రజల్ని ఓట్లు అడిగితేనే సరిపోదు. ఓట్లు చీల్చాలి.. తప్పుడు...

HOT NEWS

css.php
[X] Close
[X] Close