మేఘాల్లో….. మారుతి

ప్ర‌భాస్ ఇప్పుడు పాన్ వ‌ర‌ల్డ్ స్టార్‌. త‌న‌తో సినిమా చేయ‌డం అంటే మాట‌లు కాదు. దేశ వ్యాప్తంగా పెద్ద పెద్ద ద‌ర్శ‌కులు ప్ర‌భాస్ కోసం ఎదురు చూస్తున్నారు. ఎవ‌రికీ రాని అవ‌కాశం.. మారుతికి వ‌చ్చింది. దాన్ని స‌ద్వినియోగం చేసుకోవ‌డానికి మారుతి… అంతే గ‌ట్టిగా క‌ష్ట‌ప‌డుతున్నాడు. ఈ సినిమాలో ప్ర‌భాస్ క్యారెక్ట‌రైజేష‌న్‌, డ్ర‌స్సింగ్ స్టైల్‌, బాడీ లాంగ్వేజ్‌.. ఇవ‌న్నీ స‌రికొత్త‌గా ఉండేలా జాగ్ర‌త్త ప‌డుతున్నాడు. మారుతి స్క్రిప్టు రైటింగ్ లో చాలా ఫాస్ట్‌. నెల రోజుల్లోనే స్క్రిప్టు మొత్తం అవ్వ‌గొట్ట‌గ‌ల‌డు. కానీ… ఇది ప్ర‌భాస్ సినిమా. అందుకే నెల‌ల త‌ర‌బ‌డి రాస్తూనే ఉండిపోయాడు. మేకింగ్ విష‌యంలోనూ రాజీ ప‌డ‌డం లేదు.

ఈ సినిమా మొద‌లైంది. కొన్ని రోజులు షూటింగ్ కూడా జ‌రుపుకొంది. మారుతి వ‌ర్క్ ప‌ట్ల ప్ర‌భాస్ పూర్తి సంతృప్తితో ఉన్నాడ‌ని టాక్‌. “నా చేతిలో ఏడు సినిమాలున్నాయ్‌.. ఏ సెట్లోనూ ఇంత జోవియ‌ల్‌గా స‌ర‌దాగా లేను.అస‌లు షూటింగ్ జ‌రుగుతున్న‌ట్టే లేదు“ అంటూ త‌న స‌న్నిహితుల‌కు చెబుతున్నాడ‌ట ప్ర‌భాస్‌. ఈ ఫీడ్ బ్యాక్ చూసి.. మారుతి ఫుల్ ఖుషీ అయిపోతున్నాడు. ఫిబ్ర‌వరిలో ఈ సినిమాకి సంబంధించిన కొత్త షెడ్యూల్ మొద‌లు కాబోతోంది. ఇందుకోసం హైద‌రాబాద్‌లో ఓ భారీ సెట్ వేశారు. అక్క‌డే కీల‌క‌భాగం షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close