ప్రభాస్‌.. రాయ‌ల్‌.. రాజా సాబ్‌.. అంబాసిడ‌ర్‌

ప్ర‌భాస్ – మారుతి కాంబినేష‌న్‌లో ఓ చిత్రం రూపుదిద్దుకొంటున్న సంగతి తెలిసిందే. ప్ర‌భాస్ బిజీ షెడ్యూళ్ల మ‌ధ్య‌.. ఈ సినిమానీ కొంచెం కొంచెం పూర్తి చేస్తున్నాడు. అయితే టైటిలేం ఖ‌రారు కాలేదు. మ‌ధ్య‌లో బోలెడు పేర్లు బ‌య‌ట‌కు వచ్చాయి. రాజా డీల‌క్స్ పేరు ఒక‌ప్పుడు గ‌ట్టిగా వినిపించింది. ఆ టైటిల్ కీ మా క‌థ‌కీ సంబంధం లేదు అని మారుతి గ‌ట్టిగా చెప్పేశాడు. ఆ త‌ర‌వాత‌.. కొత్త కొత్త పేర్లు బ‌య‌ట‌కు రావ‌డం మొద‌ల‌య్యాయి.

ఈ సినిమా కోసం రాయ‌ల్‌, రాజాసాబ్‌, అంబాసిడ‌ర్ అనే పేర్లు రిజిస్ట‌ర్ చేయించారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ పేరు మీద ఈ టైటిళ్లు రిజిస్ట‌ర్ అయ్యాయి. దాంతో… ప్ర‌భాస్ సినిమాకి వీటిలో ఒక పేరు ఖ‌రారు చేస్తార‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అయితే.. ఈ టైటిల్స్ కూడా చిత్ర‌బృందం ప‌రిగ‌ణ‌లోనికి తీసుకోవ‌డం లేదు. ప్ర‌భాస్ క‌టౌట్‌కి రాయ‌ల్‌, రాజా సాబ్ పేర్లు బాగుంటాయి. కాక‌పోతే వీటికంటే మంచి పేరు అన్వేషించే ప‌నిలో ఉన్నాడు మారుతి. ఆగ‌స్టు నుంచి కొత్త షెడ్యూల్ మొద‌లు కానుంది. ప్రాజెక్ట్ కెతో స‌మాంత‌రంగా ఈ సినిమాని పూర్తి చేయాల‌న్న‌ది ప్ర‌భాస్ ప్లాన్‌.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఈవారం బాక్సాఫీస్‌: రాంగ్‌ ‘టైమింగ్‌’ కాదుగా!?

ఏపీలో ఎన్నిక‌ల వేడి రోజు రోజుకీ పెరుగుతోంది. ఎక్క‌డ విన్నా, రాజ‌కీయాల‌కు సంబంధించిన అంశాలే. ఎవ‌రు గెలుస్తారు, ఎవ‌రు ఓడిపోతారు? అనే చ‌ర్చ తీవ్రంగా సాగుతోంది. సినిమా ముచ్చట్ల‌కు కొంత‌కాలం పుల్...

చిరుని క‌లిసిన మారుతి.. ఏం జ‌రుగుతోంది?

చిరంజీవితో ఓ సినిమా చేయాల‌ని మారుతి ఎప్ప‌టి నుంచో అనుకొంటున్నారు. ఇది వ‌ర‌కు వీరి కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌న్న వార్త‌లు కూడా హ‌ల్ చ‌ల్ చేశాయి. అంతా ఓకే అనుకొన్న త‌రుణంలో.....

ఎక్స్ క్లూజీవ్‌: ముగ్గురు హీరోయిన్ల‌తో ప్ర‌భాస్ పాట‌

ఓ మాస్ హీరో ప‌క్క‌న ఇద్ద‌రు హీరోయిన్లు డాన్స్ చేస్తే... ఆ మజానే వేరు. అలాంటిది ముగ్గురు హీరోయిన్లు చిందేస్తే... థియేట‌ర్లు ద‌ద్ద‌రిల్లిపోవ‌డం ఖాయం. అలాంటి బ్లాస్ట్ ఒక‌టి 'రాజా సాబ్‌'లో ఉంది....

కడపలో వీధి వీధికి వైఎస్ ఫ్యామిలీ వార్ !

కడప ఎన్నికల బరి ఎవరూ ఊహించనంత కొత్త మలుపులు తిరుగుతోంది. వైఎస్ కుటుంబ సభ్యులంతా రెండు వర్గాలుగా విడిపోయి ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ , అవినాష్ రెడ్డి కోసం ...

HOT NEWS

css.php
[X] Close
[X] Close