ప్ర‌భాస్ – రాధాకృష్ణ సినిమా అప్ డేట్స్‌

ఓ ప‌క్క సాహో ప‌నులు చ‌క్క‌బెడుతూనే మ‌రోవైపు `జిల్‌` ఫేమ్ రాధాకృష్ణ సినిమానీ ముందుకు తీసుకెళ్తున్నాడు ప్ర‌భాస్. ఆగ‌స్టు 15న సాహో విడుద‌ల అవుతున్న సంగ‌తి తెలిసిందే. అంత‌కంటే ముందే రాధాకృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించే సినిమాని ప‌ట్టాలెక్కించేశాడు. ఇది వ‌ర‌కే.. యూర‌ప్‌లో కొంత‌భాగం తెర‌కెక్కించారు. ఇప్పుడు హైద‌రాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొద‌ల‌వ్వ‌బోతోంది. గురువారం నుంచి హైద‌రాబాద్‌లోని అన్న‌పూర్ణ స్టూడియోస్‌లో కొత్త షెడ్యూల్‌కి శ్రీ‌కారం చుట్ట‌నుంది టీమ్‌. దాదాపు 15 రోజుల పాటు కీల‌క స‌న్నివేశాలు తెర‌కెక్కిస్తారు. ఇందుకోసం ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ ఆర్‌.ర‌వీంద‌ర్‌… ఓ ప్ర‌త్యేక మైన సెట్ తీర్చిదిద్దారు. ఈ సెట్లోనే ఇప్పుడు షూటింగ్ జ‌ర‌గ‌బోతోంది. ఇదో పిరియాడిక‌ల్ డ్రామా. సెట్స్ అవ‌స‌రం చాలా ఎక్కువ‌. క‌థానుగుణంగా సెట్స్‌ని రూపొందించ‌డానికి ర‌వీంద‌ర్ పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తులు చేశారు. యూర‌ప్‌లో కూడా కొన్ని సెట్స్ వేయ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని 2020 వేస‌విలో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

video

‘ప్ర‌స‌న్న‌వ‌ద‌నం’ ట్రైల‌ర్‌: కొత్త పాయింటే ప‌ట్టారు

https://www.youtube.com/watch?v=uy8tkUFAsnA సుహాస్‌పై ప్రేక్ష‌కుల‌కు ఓ మంచి అభిప్రాయ‌మే ఉంది. త‌ను క‌చ్చితంగా విభిన్న ప్ర‌య‌త్నాలు చేస్తాడ‌నది అంద‌రి న‌మ్మ‌కం. క‌ల‌ర్ ఫొటో నుంచి అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు వ‌ర‌కూ త‌న ట్రాక్ రికార్డ్...

హరీష్ రావు ఉత్తుత్తి రాజీనామా – కామెడీ చేసిన కాంగ్రెస్ !

తెలంగాణ ఉద్యమం కోసం ఇప్పటికే ఎన్నో సార్లు రాజీనామా చేశానని.. తనకు పదవులు ఓ లెక్క కాదంటూ చెప్పే హరీష్ రావు.. తాజాగా చేసిన రాజీనామా ఆయనను ట్రోల్ చేసేలా ఉంది....

చేసింది పొన్నవోలే కానీ చేయించింది జగన్ కాదట !

సీబీఐ చార్జిషీట్‌లో వైఎస్ఆర్ పేరును సోనియా గాంధీ పెట్టించారంటూ ఇంత కాలం జగన్ చేస్తున్న ప్రచారానికి షర్మిల ఒకే ఒక్క డైలాగ్ తో చెక్ పెట్టారు. పొన్నవోలు ద్వారా...

నారా భువనేశ్వరి డీప్ ఫేక్ ఆడియోతో వైసీపీ అరాచకం !

ఇంట్లో సొంత కుటుంబసభ్యుల్ని అత్యంత హీనంగా దూషిస్తున్న జగన్మోహన్ రెడ్డి పార్టీ.. ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం పూర్తిగా కంట్రోల్ తప్పిపోయింది. ఏకంగా నారా భువనేశ్వరి ఆడియో పేరుతో డీప్ ఫేక్...

HOT NEWS

css.php
[X] Close
[X] Close